‘వరిసు’ రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పులేదు.. సంక్రాంతి బరిలోనే ‘వారసుడు’.. మరోసారి కన్ఫమ్!

By team teluguFirst Published Dec 1, 2022, 11:16 AM IST
Highlights

తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy) నటిస్తున్న బైలింగ్వువల్ చిత్రం ‘వారసుడు’. భారీ అంచనాలతో వస్తున్న మూవీ రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ వచ్చింది.
 

తొలిసారిగా తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy) డైరెక్ట్ గా తెలుగులో నటిస్తున్న చిత్రం ‘వారసుడు’ (Varasudu). వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ నిర్మిస్తున్నారు.  ‘మహార్షి’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న వంశీ పైడిపల్లి విజయ్ కాంబోలో వస్తుండటంతో మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి. తుదిదశ షూటింగ్ లో ఉన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ కూడా అందుతున్నాయి. 

రీసెంట్ గా తమిళం, తెలుగులో ఫస్ట్ సింగిల్ నూ రిలీజ్ చేశారు. ‘రంజితమే’ టైటిల్ తో వచ్చిన ఈ సాంగ్ దుమ్ములేపుతోంది. విజయ్, రష్మిక మాస్ స్టెప్పులు కూడా అదిరిపోయాయి. ఇదిలా ఉంటే.. ఇటీ ఈ చిత్రం విడుదలపై కొంత వివాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దిల్ రాజ్ కూడా సినిమాతో ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, హిందీలోనూ విడుదల కాబోతుందని క్లారిటీ ఇచ్చారు. కానీ రిలీజ్ డేట్ పై మరోసారి పక్కాగా క్లారిటీ ఇవ్వలేదు. దీంతో సినిమా వాయిదా పడుతుందా అనే సందేహం నెలకొంది. రిలీజ్ డేట్ పై తాజాగా అధికారికంగా ప్రకటన అందింది.

‘వారసుడు’ చిత్రం  విడుదలలో ఎలాంటి మార్పులేదని, వచ్చే ఏడాది జనవరి 12నే ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోందని తెలుస్తోంది. యూకే డిస్ట్రిబ్యూషన్ సంస్థ అహింస ఎంటర్ టైనర్ మెంట్స్ తాజాగా మరోసారి రిలీజ్ డేట్ పై కన్ఫర్మేషన్ ఇచ్చింది. సంక్రాతి బరిలోనే  ‘వారసుడు’ నిలుస్తున్నాడని  తెలిపింది. తెలుగులోనూ విజయ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక సంక్రాంతికే  బలయ్య ‘వీరసింహారెడ్డి’, మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, అజిత్ ‘తునివు’ కూడా  విడుదల కానుంది.

శ్రీవెంకటేశ్వర క్రీయేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో  నిర్మిస్తున్నారు. విజయ్ ను సరికొత్తగా వంశీ పైడిపల్లి ప్రజెంట్ చేయబోతున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తోంది. శరత్ కుమార్, ప్రకాశ్ రాజ్, ఖుష్బు, స్నేహ, జయసుధ, యోగి బాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 

 

Let’s get ready for 🥳

UK release by 🔥

12.01.23 😉 pic.twitter.com/D0O1wayjGs

— Ahimsa Entertainment (@ahimsafilms)
click me!