షాక్: ‘దృశ్యం 2’ థియేటర్ రిలీజ్ కి నో చెప్పిన ఛాంబర్

By Surya PrakashFirst Published Feb 18, 2021, 9:42 AM IST
Highlights

  ‘దృశ్యం2’ చిత్రం పిభ్రవరి 19 న అమేజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. అదే సమయంలో థియోటర్ లోనూ ఈ సినిమా రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. హీరో మోహన్ లాల్ సైతం...అయ్యే అవకాసం ఉంది అన్నారు. అయితే థియోటర్ ఓనర్స్ అశోశియోషన్, కేరళ ఫిల్మ్ ఛాంబర్ మాత్రం ఈ సినిమా థియోటర్ రిలీజ్ కు ఒప్పుకోమని తేల్చేసారు. 
 


విలక్షణ నటుడు మోహన్‌లాల్‌ కీలక పాత్రలో జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో వచ్చిన మలయాళ చిత్రం ‘దృశ్యం’. క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో 2013లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, ఇతర భాషల్లో రీమేక్‌ అయి రికార్డు సృష్టించింది. థియేటర్‌లో ప్రేక్షకుడిని మునివేళ్లపై కూర్చోబెట్టిన ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందా? అని అందరూ ఆశగా ఎదురు చూశారు. ఆ ఆశలు త్వరలోనే నెరవేరబోతున్నాయి.  ‘దృశ్యం2’ చిత్రం పిభ్రవరి 19 న అమేజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. అదే సమయంలో థియోటర్ లోనూ ఈ సినిమా రిలీజ్ అవుతుందని అందరూ భావించారు. హీరో మోహన్ లాల్ సైతం...అయ్యే అవకాసం ఉంది అన్నారు. అయితే థియోటర్ ఓనర్స్ అశోశియోషన్, కేరళ ఫిల్మ్ ఛాంబర్ మాత్రం ఈ సినిమా థియోటర్ రిలీజ్ కు ఒప్పుకోమని తేల్చేసారు. 

కేరళలో థియోటర్స్ రీఓపెన్ అయ్యిన నేపధ్యంలో ఈ సినిమా థియోటర్ రిలీజ్ అయితే మంచి ఓపినింగ్స్ వస్తాయని భావించారు. అయితే ఈ సినిమా నిర్మాత తన ఆర్దిక సమస్యలు నుంచి బయిటపడటానికి ఓటీటికు ఇచ్చేయాలని డిసైడ్ అయ్యారు. ఇది థియోటర్ ఓనర్స్ కు చాలా కోపం తెప్పించింది. ఓటీటిలో , థియోటర్ లో ఒకే సారి రిలీజ్ చేస్తే ఓపినింగ్స్ ఉండవని,కలెక్షన్స్ ఉండవని అంటున్నారు. సినిమా థియోటర్ లో రిలీజ్ అయ్యిన 42 రోజులు తర్వాత మాత్రమే ఓటీటిలలో రిలీజ్ చేస్తామని ఫిల్మ్ ఛాంబర్ దగ్గర ఎగ్రిమెంట్ చేసి సైన్ చేయాలి. అటువంటిది ఏమీ ‘దృశ్యం2’ నిర్మాతలు చేయలేదు. దాంతో ఇండస్ట్రీ రూల్స్ ప్రకారం ఓటీటిలో మొదట రిలీజ్ అయిన సినిమా తర్వాత థియోటర్ లో రిలీజ్ చెయ్యనని చెప్పేసారు. 
 

సీక్వెల్‌నూ జీతూ జోసెఫ్‌ తెరకెక్కిస్తున్నారు. ఆశీర్వాద్‌ సినిమాస్‌ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆంటోనీ పెరుంబవూర్‌ నిర్మిస్తున్నారు. నటీనటులు, సాంకేతిక బృందం ఇతర వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ‘దృశ్యం’ పేరుతో తెలుగులో వెంకటేశ్‌, మీనా నటించగా, హిందీలో అజయ్‌దేవ్‌గణ్‌, శ్రియలు నటించారు. తెలుగు, హిందీ భాషల్లోనూ మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో ‘పాపనాశం’ పేరుతో కమల్‌హాసన్‌, గౌతమిలు నటించారు.

మలయాళ ‘దృశ్యం’ విడుదలైన నాటితో పోలిస్తే ఇప్పుడు మోహన్‌లాల్‌ నటనా పరిధి పెరిగింది. ఇతర భాషల్లోని సినిమాల్లో ఆయన కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతేకాకుండా, ఆయన నటించిన ‘మన్యం పులి’, ‘లూసిఫర్‌’ చిత్రాలు తెలుగులోనూ అలరించాయి. మరి ‘దృశ్యం2’ను కేవలం మలయాళానికే పరిమితం చేస్తారా? ఇతర భాషల్లోనూ విడుదల చేస్తారా? అన్నది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే! 

అయితే అందుతున్న సమాచారం మేరకు.. ఇప్పుడు ఈ చిత్రం తెలుగులో కూడా రీమేక్ కావడానికి ప్లానింగ్ అయితే ఉంది. సీక్వెల్ కోసం ప్రపోజల్ ను వెంకటేష్ అందుకున్నాడు. ఆయన ఈ ప్రాజెక్ట్ గురించి రెండు,మూడు  రోజుల్లో దర్శక,నిర్మాతలతో మాట్లాడనున్నాడు. మే నెలలో తెరపైకి రానున్న ‘నారప్ప’ షూటింగ్ ను వెంకటేష్ ఇటీవల పూర్తి చేసారు. అలాగే ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి ‘ఎఫ్ 3’ షూటింగ్‌లో ఉన్నారు.

click me!