కాపీ చేసి భలే దొరికిపోయావ్ థమన్ అంటూ... ఆడుకుంటున్న నెటిజెన్స్

Published : Dec 16, 2020, 04:36 PM IST
కాపీ చేసి భలే దొరికిపోయావ్ థమన్ అంటూ... ఆడుకుంటున్న నెటిజెన్స్

సారాంశం

రవితేజ-శృతి హాసన్ జంటగా దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ మూవీ తెరకెక్కుతుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుండి 'బల్లేగా దొరికావే బంగారం' సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ ట్యూన్ ని ఓ లాటిన్ మూవీ నుండి థమన్ కాపీ చేసినట్లు నెటిజెన్స్ ఆరోపిస్తున్నారు.

 
రవితేజ-శృతి హాసన్ జంటగా దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ మూవీ తెరకెక్కుతుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుండి 'బల్లేగా దొరికావే బంగారం' సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ ట్యూన్ ని ఓ లాటిన్ మూవీ నుండి థమన్ కాపీ చేసినట్లు నెటిజెన్స్ ఆరోపిస్తున్నారు. లాటిన్ సాంగ్ ట్యూన్ కొట్టేస్తే మేము కనిపెట్టలేమా అంటూ థమన్ ని భారీగా ట్రోల్ చేస్తున్నారు. ట్విట్టర్ లో థమన్ యాష్ ట్యాగ్ కొడితే వరుసగా అనేక ట్రోల్స్ దర్శనం ఇస్తున్నాయి. 
 
సోషల్ మీడియా యుగంలో ప్రతి విషయంపై అవగాహన ఉంటున్న నెటిజెన్స్ ...ఎక్కడ నుండి కాపీ చేసినా వెంటనే కనిపెట్టేస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్ నుండి ఇటీవల ఎన్టీఆర్ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లోని కొన్ని షాట్స్ రాజమౌళి వేరే  చోట నుండి గ్రహించిన విషయాన్ని నెటిజెన్స్ ట్రోల్ చేయడం జరిగింది. 

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే