Thalapathy 68 : వెంకట్ ప్రభుతో విజయ్ దళపతి సినిమా.. గ్రాండ్ గా పూజా కార్యక్రమం.. నటీనటుల వివరాలు

Published : Oct 24, 2023, 02:06 PM IST
Thalapathy 68 : వెంకట్ ప్రభుతో విజయ్ దళపతి సినిమా.. గ్రాండ్ గా పూజా కార్యక్రమం.. నటీనటుల వివరాలు

సారాంశం

తమిళ స్టార్ విజయ్ దళపతి నెక్ట్స్ సినిమా ప్రారంభమైంది. ఈరోజు పూజా కార్యక్రమాలను గ్రాండ్ గా నిర్వహించారు. సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.  మూవీ డిటేయిల్స్  ఆసక్తికరంగా మారాయి.  

తమిళ స్టార్ విజయ్ దళపతి (Vijay Thalapathy) కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఆ సినిమాల కోసం ఇక్కడి ఆడియెన్స్ కూడా ఎదురుచూస్తుంటారు. తెలుగులోనూ విజయ్ కి అభిమానులు కూడా ఉండటం విశేషం. దీంతో ఆయన చిత్రాలకు డిమాండ్ ఉంటుంది. చివరిగా తెలుగులో ‘వరిసు’తో అలరించారు. ప్రస్తుతం ‘లియో’ సినిమాతో థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద మంచి రిజల్ట్ ను అందుకుంటోంది. 

ఈ క్రమంలో అభిమానులకు మరోగుడ్ న్యూస్ అందింది. Thalapathy 68 సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాన్ని ఈనెలలోనే నిర్వహించారు. ఈ సందర్భంగా వీడియోను షేర్ చేస్తూ విజయ్ దళపతితో సినిమా చేస్తున్నందుకు మేకర్స్ సంతోషించారు. AGS ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అఘోరాం’, గణేశ్, సురేశ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వెంకట్ ప్రభు (Venkat Prabhu)  దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ - వెంకట్ ప్రభు కాంబోలో తొలిసారి సినిమా వస్తుండటం విశేషం. 

ఈ చిత్రానికి Thalapathy 68 అనే వర్క్ టైటిల్ ను అందించారు. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా.. సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇఫ్పటికే చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. సాంగ్ షూటింగ్ తోనే ఫస్ట్ షెడ్యూల్ ముగిసిందని తెలుస్తోంది. ఇప్పటి నుంచి చిత్రీకరణ శరవేగంగా జరగనుంది. ఇక ఈ చిత్రంలో సీనియర్ నటి స్నేహా, యంగ్ సెన్సేషన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), ప్రభుదేవ, జయరామ్, లైలా, యోగి బాబు తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?