క్రిస్మస్ ఫైట్.. నాలుగు సినిమాలు ఒకేసారి!

Published : Nov 09, 2018, 05:53 PM IST
క్రిస్మస్ ఫైట్.. నాలుగు సినిమాలు ఒకేసారి!

సారాంశం

పెద్ద సినిమాలు వస్తే మీడియం సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఆలోచిస్తుంటారు. అయితే చిన్న సినిమాలు ఎన్ని రిలీజైన ఫైనల్ గా ఆడియెన్స్ ని మెప్పించిన సినిమాలే మంచి కలెక్షన్స్ అందుకుంటాయి. ఇక మీడియం బడ్జెట్ సినిమాల పరిస్థితి సినిమా రిలీజ్ వరకు చెప్పలేము. 

ఇకపోతే చాలా రోజుల తరువాత టాలీవుడ్ లో భారీ ఫైట్ కి డేట్ ఫిక్స్ అయ్యింది. నాలుగు సినిమాలు క్రిస్మస్ ఫెస్టివల్ ని టార్గెట్ చేశాయి. డిసెంబర్ 21న సినిమాను రిలీజ్ చెయ్యాలని నాలుగు సినిమాల వాళ్లు ఫిక్స్ అయ్యారు. యాత్ర - అంతరిక్షం - KGF - పడి పడి లేచే మనసు సినిమాలు ఒకే రోజు పోటీకి సిద్ధమయ్యాయి. ఈ సినిమాలు వేటికవే ప్రత్యేకత అని చెప్పాలి. 

డిఫరెంట్ కథాంశంతో వస్తున్న చిత్రాలు కావున సెలవుల్లో గట్టి పోటీ తప్పదని చెప్పవచ్చు. వరుణ్ తేజ్ అంతరిక్షం సైన్స్ ఫిక్షన్ కథ కావడంతో అందరి ద్రుష్టి ఎక్కువగా ఈ సినిమాపైనే ఉంది. ఇక యాత్ర వైఎస్ బయోపిక్ కావడంతో ఆ సినిమాపై కూడా అంచనాలు నెలకొన్నాయి. కన్నడ చిత్రం KGF కొద్దిగా అంచనాలను రేపుతోంది. 

ఫైనల్ గా లెట్ గా వస్తాడనుకున్న శర్వానంద్ తన రొమాంటిక్ లవ్ స్టోరీ 'పడి పడి లేచే మనసు' సినిమాతో కూడా అదే రోజు పోటీకి సిద్దమయ్యాడు. మరి ఈ క్రిస్మస్ రేస్ లో ఏ సినిమా ఎక్కువగా వసూళ్లను అందుకుంటుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Satluj OTT Release: 25000 మిస్సింగ్ కేసుల కథ, సెన్సార్ కష్టాలతో ఏళ్ల తరబడి వాయిదా..ఎట్టకేలకు ఓటీటీలో రిలీజ్
Alpha OTT Release: ఆలియా 'ఆల్ఫా' ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చు?