'సైరా' టీమ్ ధీమా.. అసలు పర్మిషన్లు వస్తాయా..?

Published : Oct 01, 2019, 04:40 PM ISTUpdated : Oct 01, 2019, 04:41 PM IST
'సైరా' టీమ్ ధీమా.. అసలు పర్మిషన్లు వస్తాయా..?

సారాంశం

ఆంధ్రలో అదనపు ఆటలు వేయడానికి సైరా సినిమాకు ఇప్పటి వరకు పర్మిషన్ రాలేదు. వస్తుందా? రాదా? అన్నది తెలియదు.   

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఏపీలో ఈ సినిమా అదనపు ఆటలు వేయడానికి ఇప్పటివరకు ప్రభుత్వం నుండి పర్మిషన్లు రాలేదు. అసలు పర్మిషన్ వస్తుందా..? రాదా..? అనేది కూడా అర్ధంకాని పరిస్థితి. 

కానీ రేపు ఉదయం 5 గంటలకే షోలు పెట్టుకొని, టికెట్లు అమ్మేయమని, బయ్యర్లకు 'సైరా' టీం నుండి సందేశాలు వెళ్లినట్లు సమాచారం. అయితే అలా ముందే అమ్మేస్తే ఆ తరువాత పర్మిషన్లు రాకపోతే సమస్య అవుతుందని బయ్యర్లు, ఎగ్జిబిటర్లు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఆదేశాలు రాలేదు కానీ మెగా కాంపౌండ్ మాత్రం ధీమాగా ఉంది.

ఓ పక్క జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ద్వారా, మరోపక్క వైకాపాలోని కాపు నాయకుల ద్వారా, ఇంకోపక్క రెడ్డి సామాజిక వర్గం ద్వారా ప్రయత్నిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ప్రయత్నాలు ఇలా చేస్తూనే జిల్లాల వారీగా, థియేటర్ల నుండి కలెక్టర్లకు అప్లికేషన్లు అందించి అక్కడ నుండి పర్మిషన్లు తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు సమాచారం.

ఐదు గంటల కంటే ముందు షో వేయకూడదని, 5 గంటలకు మాత్రం షో పడితే చాలని 'సైరా' టీం భావిస్తోంది. ఐదు గంటల షో కోసమైనా.. పర్మిషన్లు రావడానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. పర్మిషన్లు రాకపోతే గనుక ఇక ఎర్లీ మార్నింగ్ షోకు రద్దవ్వడం ఖాయం!

 

PREV
click me!

Recommended Stories

Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు
Emmanuel కి బిగ్‌ బాస్‌ తెలుగు 9 ట్రోఫీ మిస్‌ కావడానికి కారణం ఇదే.. చేసిన మిస్టేక్‌ ఏంటంటే?