బ్యాడ్ గర్ల్ బికినీ వేసినా ప్రయోజనం లేదు.. ఇంత దారుణమా!

Published : Sep 20, 2019, 08:28 PM ISTUpdated : Sep 20, 2019, 08:32 PM IST
బ్యాడ్ గర్ల్ బికినీ వేసినా ప్రయోజనం లేదు.. ఇంత దారుణమా!

సారాంశం

శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సల్మాన్ ఖాన్ సరసన కిక్ చిత్రంలో నటించిన బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. జాక్వెలిన్ గ్లామర్ కు కుర్రకారు ఫిదా అన్నారు. బాలీవుడ్ లో మిగిలిన స్టార్ హీరోయిన్లతో పోల్చితే జాక్వెలిన్ ఖాతాలో భారీ హిట్స్ అయితే ఏమీలేవు. కానీ ఇప్పటికి గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తోంది. 

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఇటీవల విడుదలైన ప్రభాస్ సాహో చిత్రంలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. బ్యాడ్ బాయ్ అంటూ సాగే పాటలో జాక్వెలిన్ ఏ రేంజ్ లో అందాలు ఆరబోసిందో అందరికి తెలిసిందే. ఇక బాలీవుడ్ లో యువ హీరో సుశాంత్ సింగ్ కు మంచి క్రేజ్ ఉంది. 

ఎంఎస్ ధోని చిత్రంతో దేశవ్యాప్తంగా సుశాంత్ పాపులర్ అయ్యారు. ప్రస్తుతం జాక్వెలిన్, సుశాంత్ జంటగా డ్రైవ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. తరుణ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో ఛేజింగ్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయంటూ చిత్ర యూనిట్ మొదటి నుంచి చెబుతోంది. 

కానీ ఈ చిత్రం పలు సందర్భాల్లో వాయిదా పడింది. షూటింగ్ కూడా చాలా ఆలస్యంగా జరిగింది. ఓ సందర్భంలో అయితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ కూడా ప్రచారం జరిగింది. దీనితో ఈ చిత్రానికి ఏర్పడాల్సిన బజ్ పూర్తిగా దెబ్బ తింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నించినా ఊహించని షాక్ ఎదురైంది. 

ఎలాంటి బజ్ లేకపోవడంతో బయ్యర్లు ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు. దీనితో ఈ చిత్రాన్ని థియేటర్స్ లో కాకుండా నెట్ ఫ్లిక్స్ లాంటి డిజిటల్ మీడియాలో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఘాటుగా అందాలు ఆరబోసినట్లు తెలుస్తోంది. డ్రైవ్ చిత్రానికి జాక్వెలిన్ గ్లామర్ కూడా పనిచేయలేదు. సుశాంత్ తో కలసి జాక్వెలిన్ బికినిలో ఉన్న స్టిల్స్ వైరల్ అవుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

20 ఏళ్లుగా స్టార్ డమ్ కోసం ఎదురుచూసి.. తెలుగులో కనిపించకుండా పోయిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Bigg Boss 9 Telugu: షాకింగ్ ట్విస్ట్... ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ విన్నర్ రేసులోకి..