దండుపాళ్యం దర్శకుడితో లవర్ బాయ్ హారర్ సినిమా!

Published : Oct 31, 2018, 06:07 PM IST
దండుపాళ్యం దర్శకుడితో లవర్ బాయ్ హారర్ సినిమా!

సారాంశం

సీనియర్ నిర్మాత యం.ఎస్.రాజు తనయుడు సుమంత్ అశ్విన్ స్టార్ డమ్ కోసం తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతకుముందు ఆ తరువాత - లవర్స్ అలాగే కేరింత వంటి సినిమాలతో లవర్ బాయ్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న అశ్విన్ నెక్స్ట్ ఒక హారర్ థ్రిల్లర్ సినిమాలో నటించనున్నాడు.

సీనియర్ నిర్మాత యం.ఎస్.రాజు తనయుడు సుమంత్ అశ్విన్ స్టార్ డమ్ కోసం తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతకుముందు ఆ తరువాత - లవర్స్ అలాగే కేరింత వంటి సినిమాలతో లవర్ బాయ్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న అశ్విన్ నెక్స్ట్ ఒక హారర్ థ్రిల్లర్ సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమా ఒకేసారి నాలుగు భాషల్లో తెరకెక్కుతుండటం విశేషం. 

దండుపాళ్యం వంటి సినిమాలతో ఓ వర్గం వారిని బాగా ఆకట్టుకొన్న శ్రీనివాసరాజు ఆ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహించనున్నాడు. ఇక గరుడవేగ సినిమాను నిర్మించిన కోటేశ్వర రావు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను ముగించుకున్న చిత్ర యూనిట్ నవంబర్ రెండవ వారంలో షూటింగ్ ను మొదలుపెట్టనుంది. 

ఎక్కువ స్పాన్ ఉన్న కథ కావడంతో నాలుగు భాషల్లో సినిమాను తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు చెప్పాడు. అంతే కాకుండా సినిమాకు రీ రికార్డింగ్ ప్రధాన ఆకర్షణగా ఉండాలని మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మను సెలెక్ట్ చేసుకున్నట్లు శ్రీనివాసరాజు వివరణ ఇస్తూ.. హారర్ థ్రిల్లర్స్ లోనే ఇదొక డిఫరెంట్ సినిమా అవుతుందని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

George Krish: మహేష్ నుంచి గోపీచంద్ వరకు, వరుసగా 5 ఫ్లాపులు.. అయినా సాహసం చేస్తున్న శర్వానంద్
Nagadurga Second Film: స్టార్‌ హీరోయిన్లకి షాకిస్తున్న ఫోక్‌ సంచలనం.. నాగదుర్గ రెండో సినిమా షురూ