స్టార్ హీరో సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్!

Published : Aug 30, 2019, 08:30 AM ISTUpdated : Aug 30, 2019, 11:54 AM IST
స్టార్ హీరో సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్!

సారాంశం

ఈ హీరో ఓ ఎన్నారై అమ్మాయితో ప్రేమలో పడ్డాడని సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా అతడి మేనేజర్ లీక్ చేశాడు. నిజానికి ఈ హీరోకి ఎఫైర్స్ కొత్తేంకాదు.. కెరీర్ ఆరంభంలో కూడా అతడిపై చాలా పుకార్లు వినిపించాయి. చాలా మంది హీరోయిన్లతో లింక్ పెడుతూ అతడిపై చాలా గాసిప్స్ వచ్చాయి.

ఇండస్ట్రీకి సంబంధించి చాలా పెద్ద కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇతడికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ హీరో ఓ ఎన్నారై అమ్మాయితో ప్రేమలో పడ్డాడని సమాచారం.

ఈ విషయాన్ని స్వయంగా అతడి మేనేజర్ లీక్ చేశాడు. నిజానికి ఈ హీరోకి ఎఫైర్స్ కొత్తేంకాదు.. కెరీర్ ఆరంభంలో కూడా అతడిపై చాలా పుకార్లు వినిపించాయి. చాలా మంది హీరోయిన్లతో లింక్ పెడుతూ అతడిపై చాలా గాసిప్స్ వచ్చాయి. కానీ వాటన్నింటినీ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చాడు. కానీ ఈసారి మాత్రం అతడి వృత్తిపరమైన జీవితానికి సంబంధం లేని ఎఫైర్.

ఈ హీరో ఆ మధ్య అమెరికా వెళ్తే.. కొత్త మేకోవర్ కోసమని అంతా అనుకున్నారు. కానీ అదే గెటప్ తో హైదరాబాద్ లో కనిపించాడు. నిజానికి అప్పుడు అతడు అమెరికా వెళ్లింది తన సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ ని కలవడం కోసమేనని తెలుస్తోంది. అతడు వయసు ముప్పై దాటేసి చాలా రోజులవుతోంది.

కావాలనుకుంటే తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పేసి తన గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంటానని చెప్పినా.. అడ్డుపడే వారెవరూ లేదు. కానీ ఈ విషయాన్ని మాత్రం అతడు రహస్యంగానే ఉంచుతున్నాడు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. మరి తన ప్రేమ విషయాన్ని ఎప్పుడు బయటపెడతాడో చూడాలి! 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 New Date: అఖండ 2 మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. బాలయ్య ఊహించని సర్‌ప్రైజ్‌, ఈ సినిమాలకు పెద్ద దెబ్బ
Venkatesh: `నువ్వు నాకు నచ్చావ్‌` మూవీతో పోటీ పడి చిత్తైపోయిన నాగార్జున, మోహన్‌ బాబు చిత్రాలివే