శృతి హాసన్ బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పేసింది!

Published : Apr 26, 2019, 10:50 AM ISTUpdated : Apr 26, 2019, 04:57 PM IST
శృతి హాసన్ బాయ్ ఫ్రెండ్ కి బ్రేకప్ చెప్పేసింది!

సారాంశం

తమిళ బ్యూటీ శృతిహాసన్ దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లో కూడా నటిస్తోంది. 

తమిళ బ్యూటీ శృతిహాసన్ దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లో కూడా నటిస్తోంది. చాలా కాలంగా ఈ బ్యూటీ లండన్ కి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైకేల్ కోర్సేల్ తో ప్రేమాయణం సాగిస్తోంది. ఇద్దరి ఇళ్లల్లో కూడా వీరి ప్రేమ విషయం తెలుసు కానీ ఇప్పుడు ఈ జంట విడిపోయినట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని మైకేల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో వెల్లడించాడు.. ''జీవితం మమ్మల్నిద్దరినీ వ్యతిరేక మార్గాల్లో ఉంచింది. దురదృష్టవసాత్తు మేమిద్దరం ఒంటరి మార్గాల్లో నడవాల్సి వస్తోంది. కానీ ఈ యంగ్ లేడీ ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ గానే మిగిలిపోతుంది. ఆమెకి జీవితాంతం స్నేహితుడిగా ఉండిపోతున్నందుకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను'' అంటూ రాసుకొచ్చాడు.

శృతితో దిగిన ఓ ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు. మూడేళ్ల క్రితం ఓ కాన్సర్ట్ కోసం శృతి లండన్ వెళ్లినప్పుడు అక్కడ ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా మైకేల్ ని కలిసింది. ఆ తరువాత ఇద్దరు స్నేహితులుగా మారడం, అది ప్రేమగా మారడం జరిగాయి.

చివరకు ఈ జంట స్నేహపూర్వకంగానే విడిపోయినట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan ఫ్యామిలీతో ప్రధాని ముచ్చట్లు.. మోదీతో మార్క్ శంకర్ ని చూశారా, వైరల్ అవుతున్న ఫోటోలు!
2026 Biggest Flops: బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ లిస్ట్ లో పవన్, ప్రభాస్ సినిమాలు.. దారుణంగా దెబ్బ తీశాయిగా