
దివంగత నటి సూపర్‌స్టార్ శ్రీదేవి చనిపోయిన ఐదేంళ్ల తరువాత ఆమెపేరుతో ఓ ఈ పుస్తకం రిలీజ్ కాబోతోంది. దివంగన నటి జీవిత చరిత్రను పుస్తకరూపంలో రానున్నది. ఈ విషయం తెలిసి అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదరు చూస్తున్నారు. ఈ ఏడాది శ్రీదేవికి సంబంధించిన చరిత్ర పుస్తక రూపంలో విడుదల కాబోతోంది. త్వరలో మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు బోనీ కపూర్ తెలిపారు.
శ్రీదేవి.. ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ పేరుతో శ్రీదేవి జీవిత చరిత్ర పుస్తకం రిలీజ్ కాబోతోంది. ఈ పుస్తకాన్ని ఆమె భర్త బోని కపూర్ స్వయంగా రిలీజ్ చేయబోతున్నారు. వీలైనంత త్వరగా ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం కోసం ఎదరుచూస్తున్నట్టు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రముఖ కాలమిస్ట్, రచయిత, పరిశోధకుడు ధీరజ్ కుమార్ ఈ పుస్తకాన్ని రాశారు. శ్రీదేవి జీవిత చరిత్రను ఈ పుస్తకం ద్వారా ఆవిష్కరించనున్నారు. వెస్ట్‌ల్యాండ్ బుక్స్ సంస్థకు ఈ పుస్తకానికి సబంధించిన సర్వ హక్కులు అప్పగించినట్టు తెలుస్తోంది.
ఇక శ్రీదేవి బయోగ్రఫీ బుక్ పై వెస్ట్‌ల్యాండ్ బుక్స్ సంస్థ కూడా అఫీషియల్ గా స్పందించారు. ఈ సంస్థతో పాటు శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కూడా ఇన్‌స్టాగ్రాంలో అధికారిక ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో పాటు బుక్ కి సబంధించిన ఫ్రంట్ పేజ్ ను వెస్ట్‌ల్యాండ్ బుక్స్ సోషల్ మీడియలో పోస్ట్ చేసింది.
ఈ పోస్ట్ తో పాటో ఓ నోట్ కూడా రాశారు వెస్ట్ ల్యాండ్స్ వారు. దివంగత లెజండరీ యాక్ట్రస్ శ్రీదేవి జీవితం ఆధారంగా బయోగ్రఫిని ప్రచురిస్తున్నామని ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఆమె ఒక సుప్రసిద్ధ, నిజమైన సూపర్ స్టార్ అందులో రాశారు. 40 ఏండ్ల కెరీర్‌లో శ్రీదేవి దాదాపు 300 సినిమాల్లో నటించారు. 2013 లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. అలాగే, నేషనల్ ఫిల్మ్ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు. ఇక త్వరలో శ్రీదేవి జీవితం ఆధారంగా బయోపిక్ కూడా తెరకెక్కే అవకాశం కనిపిస్తుంది.