ఇలియానాతో తేజ రాసలీలలు.. బయటపెట్టిన శ్రీరెడ్డి!

Published : Jun 03, 2019, 11:06 AM IST
ఇలియానాతో తేజ రాసలీలలు.. బయటపెట్టిన శ్రీరెడ్డి!

సారాంశం

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉదంతంతో ఇండస్ట్రీని షేక్ చేసిన శ్రీరెడ్డి తాజాగా దర్శకుడు తేజని టార్గెట్ చేసింది.

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉదంతంతో ఇండస్ట్రీని షేక్ చేసిన శ్రీరెడ్డి తాజాగా దర్శకుడు తేజని టార్గెట్ చేసింది. తన సోషల్ మీడియా అకౌంట్ లో తేజపై పలు ఆరోపణలు చేసింది. 'రేపు తేజ రాసలీలల వినోదం.. తాజ్ బంజారాలో ఇల్లీ అక్కతో ఏంటి మరి.. మర్చిపోయావా..?' అంటూ పోస్ట్ లు పెట్టింది.

ఇంతకీ శ్రీరెడ్డి.. తేజని టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే..? ఇటీవల 'సీత' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజ టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ ఉదంతంపై ఘాటుగా స్పందించారు.

అప్పట్లో ఆమె (శ్రీరెడ్డి) ఏదో చూసిందని ఇండస్ట్రీ పరువును రోడ్డుకి లాగేసిందని మీడియా వాళ్లు అన్నారు తప్పిదే ఇండస్ట్రీ పరువు ఏం కాలేదని అన్నారు. ఇండస్ట్రీ అంటే తమాషాగా ఉందా..? ఎవరో నలుగురైదుగురు కలిసి ఇండస్ట్రీని రోడ్డుకి లాగేస్తామంటే ఇక్కడ గాజులు తొడుక్కొని ఉన్నామా..? అంటూ ఫైర్ అయ్యారు. దీంతో తేజకి కౌంటర్ ఇస్తూ రెచ్చిపోయింది శ్రీరెడ్డి.

తేజ రాసలీలల్ని బయటపెడతా అంటూ ఇలియానాను సైతం వివాదంలోకి లాగింది. అయితే ఇప్పటివరకు ఆమె తేజ, ఇలియానాలకు సంబంధించి ఎలాంటి వీడియోలు షేర్ చేయలేదు.

గతంలో కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి ఆరోపణలు చేస్తోన్న సమయంలో తేజ ఆమెకి అండగా నిలబడ్డాడు. ఆమెకి తన సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పాడు. కానీ ఇప్పటివరకు తేజ.. శ్రీరెడ్డికి ఛాన్స్ ఇవ్వలేదు. అది కూడా మనసులో పెట్టుకొనే ఆమె ఈ తరహా వ్యాఖ్యలు చేసిందని అంటున్నారు.  

PREV
click me!

Recommended Stories

OTT Movies: ఒకవైపు రామ్ పోతినేని, మరోవైపు కీర్తి సురేష్..ఓటీటీలో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్, కంప్లీట్ లిస్ట్
Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌