Sreeleela : లీలమ్మ క్రేజ్.. పండు ముసలైనా ఆడాలా.. తాతలతో నాగిని డాన్స్ వేయించిన శ్రీలీలా.!

By Asianet News  |  First Published Nov 18, 2023, 12:59 PM IST

క్రేజీ హీరోయిన్ శ్రీలీలా తాజాగా పంచుకున్న ఇన్ స్టా పోస్ట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. వెండితెరపై తను స్టెప్పులేస్తే ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే.. ఇక తాజాగా ముసళితాతలతోనూ డాన్స్ వేయించడం ఆసక్తికరంగా మారింది. 


టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా (Sreeleela)  క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న వయస్సులోనే తన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా మారింది. తెలుగు చిత్ర పరిశ్రమలోని బిగ్ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీగా మారింది. చివరిగా బాలయ్య తో కలిసి ‘భగవంత్ కేసరి’ చిత్రంలో అలరించిన విషయం తెలిసిందే. విజ్జిపాప పాత్రలో జీవించింది. తన నటనకు మంచి మార్కులు దక్కించుకుంది. నెక్ట్స్ ఈ బ్యూటీ ‘ఆదికేశవ’ చిత్రంతో అలరించనుంది. ఈ సందర్భంగా సినిమాను వినూత్నంగా ప్రచారం చేస్తోంది. 

పంజా వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej)   - శ్రీలీలా నటించిన ‘ఆదికేశవ’ (Aadikeshava)  చిత్రంతో  అలరించబోతున్నారు. ఈ  మూవీ నంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  దీంతో యూనిట్ సినిమాను ప్రచారం చేస్తోంది. ప్రమోషన్స్ లో శ్రీలీలా కూడా పాల్గొంది. ఈ సినిమాలో తొలిసారిగా తన పేరుపై విడుదల చేసిన Leelammo సాంగ్ ను ప్రమోట్ చేస్తోంది. ఈ సందర్భంగా ఓ షూటింగ్ స్పాట్ లో కొందరు వృద్ధులతో శ్రీలీలా చేసిన డాన్స్  వైరల్ గా మారింది. ఈ సాంగ్ అంటే తనకెంత ఇష్టమో ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.

Latest Videos

శ్రీలీలా వెండితెరపైన చిందులేస్తే ఏ రేంజ్ రెస్పాన్స్ ఉంటుందో తెలిసిందే. తాజాగా ముసలాడైనా తన డాన్స్  చూస్తే స్టెప్పులేయాల్సిందేనని అనిపించింది. ఆ వీడియోను తన ఇన్ స్టా హ్యాండిల్ ద్వారా పంచుకుంది. అభిమానులు లీలమ్మ క్రేజ్ మాములుగా లేదుగా అంటూ స్పందిస్తున్నారు. అటు చదువుకుంటూ ఇటు సినిమాలు చేస్తున్న శ్రీలీలా పుల్ బిజీగా ఉంటోంది. ఇక సమయం దొరికినప్పుడల్లా తన సినిమాలను ఇలా ప్రమోట్ చేసుకుంటూనే వస్తోంది. 

వైష్ణవ్ తేజ్ - శ్రీలీలా జంటగానటిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇది ఆయన మొదటి సినిమా కావడం విశేషం. చిత్రంలో మలయాళ నటులు అపర్ణ దాస్‌, జోజు జార్జ్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండటంతో మరింత ఆసక్తి ఏర్పడింది. చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య  నిర్మిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్. డడ్లీ, ఆర్థర్ ఎ. విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 

click me!