సమంత పెళ్లి అంటూ ఫొటోస్ షేర్ చేసిన శోభిత.. వైరల్ అవుతున్న చైతు రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ కామెంట్స్

Published : Apr 02, 2023, 08:55 PM IST
సమంత పెళ్లి అంటూ ఫొటోస్ షేర్ చేసిన శోభిత.. వైరల్ అవుతున్న చైతు రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ కామెంట్స్

సారాంశం

తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది.

తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది. 30 ఏళ్ల ఈ నాజూకు అందగత్తెకు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా అవకాశాలు దక్కుతున్నాయి. 

గత కొన్ని రోజులుగా శోభిత దూళిపాళ వార్తల్లో నిలుస్తోంది. అక్కినేని నాగచైతన్యతో  ఎఫైర్ కొనసాగిస్తోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరి ఎఫైర్ రూమర్స్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. బాలీవుడ్ మీడియాలో సైతం వీళ్లిద్దరి గురించి వార్తలు వస్తున్నాయి. 

 

కొన్ని రోజుల క్రితం కూడా వీరిద్దరూ లండన్ లో డిన్నర్ డేట్ కోసం ఓ రెస్టారెంట్ లో ఉన్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీనితో శోభిత, నాగ చైతన్య వ్యవహారం చాలా దూరం వెళుతోంది అంటూ ప్రచారం జరుగుతోంది. సమంత నుంచి విడిపోయాక చైతు.. శోభితతో ప్రేమాయణం మొదలు పెట్టాడు అంటూ వార్తలు వస్తున్నాయి. 

ఈ తరుణంలో శోభిత.. సమంత పెళ్లి అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. శోభిత సమంత పెళ్లి గురించి మాట్లాడడం ఏంటి అని ఆశ్చర్యపోకండి. శోభిత కామెంట్స్ చేసింది హీరోయిన్ సమంత గురించి కాదు. ఆమె స్నేహితురాలు సమంత గురించి. 

శోభిత తన బెస్ట్ ఫ్రెండ్ సమంత వివాహానికి హాజరైంది. ఆమె ఓ డాక్టర్ అని తెలుస్తోంది. ఆమె పెళ్ళిలో శోభిత ధూళిపాళ సందడి చేసింది. మెహందీ, వెడ్డింగ్ ఫొటోస్ ని ఫ్యాన్స్ తో పంచుకుంది. ఈ వివాహ వేడుక ద్వారా కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడిందని.. అందరి కళ్ళలో సంతోషం చూశానని శోభిత పేర్కొంది. నా స్నేహితురాలి సమంతని పెళ్లి కూతురిగా చూస్తుంటే కన్నీళ్లు ఆగలేదు అంటూ శోభిత తన భావోద్వేగాన్ని పంచుకుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..