హాట్ టాపిక్: పార్టీలో శివగామి, కట్టప్పల రొమాన్స్!

Published : Nov 17, 2018, 02:31 PM IST
హాట్ టాపిక్: పార్టీలో శివగామి, కట్టప్పల రొమాన్స్!

సారాంశం

'బాహుబలి' సినిమాలో శివగామి పాత్రలో కనిపించి మెప్పించింది నటి రమ్యకృష్ణ. అదే సినిమాలో కట్టప్ప పాత్రలో పాపులారిటీ దక్కించుకున్నాడు నటుడు సత్యరాజ్. సినిమాలో రమ్యకృష్ణ దగ్గర సేవకుడిగా కనిపించిన సత్యరాజ్ ఇప్పుడు ఆమెతో రొమాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

అసలు విషయంలోకి వస్తే.. దర్శకుడు వెంకట్ ప్రభు 'పార్టీ' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా జై, శ్యామ్, సత్యరాజ్, నాజర్, రమ్యకృష్ణ, రెజీనా, సంచిత శెట్టి, నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

మల్టీస్టారర్ కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో కామెడీ పెర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఇందులో భాగంగా తెరపై రమ్యకృష్ణ, సత్యరాజ్ ల రొమాంటిక్ ట్రాక్ చూపించబోతున్నారు.

ఈ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉండగా కట్టప్ప, శివగామిలు 'బాహుబలి' వెబ్ సిరీస్ లో ప్రేమికులుగా కనిపించనున్నారు.  

PREV
click me!

Recommended Stories

Rohith: సీజన్ 10లో బిగ్గెస్ట్ షాక్, రోహిత్ అవుట్.. ఎలిమినేషన్ కంటే రామ్ ప్రసాద్ అన్న ఇలా చేయడమే ఎక్కువ బాధ
Rudravanam PS: రుద్రవనం పీఎస్ వెబ్ సిరీస్ రివ్యూ.. ఎమ్మెల్యే తమ్ముడితో సహా 8 హత్యల మిస్టరీ, ఎలా ఉందంటే