సైమా అవార్డ్స్ : విజేతలు వీరే.. ఆ మూడు చిత్రాలదే హవా!

By tirumala ANFirst Published Aug 16, 2019, 2:34 PM IST
Highlights

సౌత్ ఇండియన్ చిత్రాల బిగ్గెస్ట్ ఈవెంట్ సైమా అవార్డుల వేడుక ఖతార్ రాజధాని దోహాలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు దక్షణాది చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ సెలెబ్రిటీలంతా హాజరువుతున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు, అల్లు అరవింద్, కీర్తి సురేష్, నిధి అగర్వాల్, విజయ్ దేవరకొండ, సీనియర్ నటి రాధిక లాంటి సెలెబ్రిటీలంతా హాజరయ్యారు. 

సౌత్ ఇండియన్ చిత్రాల బిగ్గెస్ట్ ఈవెంట్ సైమా అవార్డుల వేడుక ఖతార్ రాజధాని దోహాలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు దక్షణాది చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ సెలెబ్రిటీలంతా హాజరువుతున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు, అల్లు అరవింద్, కీర్తి సురేష్, నిధి అగర్వాల్, విజయ్ దేవరకొండ, సీనియర్ నటి రాధిక లాంటి సెలెబ్రిటీలంతా హాజరయ్యారు. సైమా అవార్డ్స్ లో జాతీయ అవార్డుల్లో సంచలనం సృష్టించిన మహానటి, రంగస్థలం చిత్రాలు మరోసారి సత్తా చాటాయి. ఇక ఆర్ఎక్స్ 100 చిత్రానికి కూడా పలు అవార్డులు దక్కాయి. 

సైమా అవార్డ్స్ లో విజేతలుగా ఎంపికైన వారి వివరాలు ఇలా ఉన్నాయి.. 

ఉత్తమ చిత్రం : మహానటి

ఉత్తమ నటి : కీర్తి సురేష్‌ (మహానటి)

ఉత్తమ నటుడు : రామ్‌చరణ్‌ (రంగస్థలం)

ఉత్తమ దర్శకుడు : సుకుమార్‌ (రంగస్థలం)  

ఉత్తమ సహాయ నటుడు : రాజేంద్ర ప్రసాద్‌ ( మహానటి)

ఉత్తమ సహాయ నటి : అనసూయ (రంగస్థలం)

ఉత్తమ హాస్య నటుడు : సత్య (ఛలో)

ఉత్తమ విలన్‌ : శరత్‌ కుమార్‌ (నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా)

ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీ శ్రీ ప్రసాద్‌ (రంగస్థలం)

ఉత్తమ గేయ రచయిత : చంద్రబోస్‌ (ఎంత సక్కగున్నవవే – రంగస్థలం)

ఉత్తమ గాయకుడు : అనురాగ్ కులకర్ణి( పిల్ల రా – ఆర్‌ఎక్స్‌ 100)

ఉత్తమ గాయని : ఎంఎం మానసీ (రంగమ్మా మంగమ్మ – రంగస్థలం)

ఉత్తమ తొలిచిత్ర నటుడు : కల్యాణ్ దేవ్‌ (విజేత)

ఉత్తమ తొలిచిత్ర నటి : పాయల్‌ రాజ్‌పుత్‌ (ఆర్‌ఎక్స్‌ 100)

ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు : అజయ్‌ భూపతి (ఆర్‌ఎక్స్‌ 100)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ : రత్నవేలు (రంగస్థలం)

ఉత్తమ కళా దర్శకడు : రామకృష్ణ (రం‍గస్థలం)

సోషల్ మీడియాలో పాపులరైన  స్టార్ : విజయ్‌ దేవరకొండ  

విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటుడు : విజయ్‌ దేవరకొండ( గీత గోవిందం)

విమర్శకుల ప్రశంసలు అందుకున్న నటి : సమంత (రంగస్థలం)  

click me!