కమల్ మనవడిగా సిద్దార్ద్..?

By Udayavani DhuliFirst Published Jan 17, 2019, 12:56 PM IST
Highlights

రొమాంటిక్ హీరోగా యూత్ సినిమాలు చేసిన సిద్దార్ద్ గత కొంతకాలంగా వెనకబడ్డారు. అయితే విభిన్నమైన సినిమాలు చేస్తూ తన రొమాంటిక్ ముద్రను తొలిగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో కమల్ హాసన్ సినిమాలో ఆయన మనవడు పాత్రను ఓకే చేసినట్లు సమాచారం.

మొదట ఈ పాత్రకు తమిళంలో స్టార్ హీరో శింబుని అనుకున్నారు. అయితే శింబు డేట్స్ ఖాళీ లేకపోవటం, శింబుకు తెలుగు,హిందీలలో మార్కెట్ లేకపోవటంతో సిద్దార్ద అయితే తెలుగు, హిందీ మార్కెట్లు కూడా కలిసి వస్తాయని ప్లాన్ చేసారట.

అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్‌ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. చిత్రం సెట్స్‌పైకి వెళ్లేలోపు ఆ విషయాలన్నీ బయిటకు వచ్చే అవకాశాలున్నాయి. ఇందులో  కమల్‌హాసన్‌ సరసన కాజల్‌ నటించబోతోంది. 

లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.  అనిరుధ్‌ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. జనవరి 18 నుంచి ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు సమాచారం.  భారతీయుడు 2 షూటింగ్‌ను చెన్నైలో ప్రారంభించనున్నారు.

తరువాత పొల్లాచ్చిలో మరో షెడ్యూల్‌ను పూర్తి చేసి మేజర్‌ షెడ్యూల్‌ కోసం ఉక్రెయిన్‌ వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అనుకున్న ప్రకారం షూటింగ్ పూర్తయితే 2020 జనవరిలో భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సినిమా తరువాత కమల్‌ పూర్తిగా సినిమాలకు గుడ్‌బై చెప్పునున్నారన్న ప్రచారం జరుగుతుండటంతో భారతీయుడు 2 భారీ హైప్‌ క్రియేట్‌ అయ్యింది.

click me!