Ram Charan: 1200 మందితో రాంచరణ్ గూస్ బంప్స్ తెప్పించే ఫైట్ .. ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇవిగో

Published : Jul 06, 2022, 06:55 AM IST
Ram Charan: 1200 మందితో రాంచరణ్ గూస్ బంప్స్ తెప్పించే ఫైట్ .. ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇవిగో

సారాంశం

రాంచరణ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఆర్ఆర్ఆర్ లో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం రాంచరణ్ కి పాన్ ఇండియా క్రేజ్ తీసుకు వచ్చింది. 

రాంచరణ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఆర్ఆర్ఆర్ లో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం రాంచరణ్ కి పాన్ ఇండియా క్రేజ్ తీసుకు వచ్చింది. రామరాజుగా చరణ్ లుక్, నటన నార్త్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేశాయి. ప్రస్తుతం రాంచరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. 

ఈ చిత్రంతో తన పాన్ ఇండియా ఇమేజ్ ని పెంచుకోవాలని రాంచరణ్ భావిస్తున్నాడు. డైరెక్టర్ శంకర్ సినిమాలు ఒక గ్రాండియర్ లా ఉంటాయి. RC 15 విషయంలో కూడా శంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ అమృత్ సర్ లో జరుగుతోంది. 

1000 మంది డాన్సర్లతో రాంచరణ్ పై శంకర్ అదిరిపోయే సాంగ్ ని షూట్ చేస్తున్నారు. ఈ సాంగ్ కి గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతోంది. దీనితో చిత్ర షూటింగ్ కీలక దశలోకి ఎంటర్ అవుతుందనే చెప్పాలి. హైదరాబాద్ లో జరిగే షెడ్యూల్ లో శంకర్ రాంచరణ్ పై 1200 మందితో కళ్లుచెదిరే యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించబోతున్నారు. 

సినిమాకే ఈ ఫైట్ సీన్ ప్రధాన ఆకర్షణగా ఉండబోతోంది. దాదాపు 20 రోజుల పాటు ఈ భారీ పోరాట సన్నివేశాన్ని శంకర్ చిత్రీకరించనున్నారట. రాంచరణ్ ఈ చిత్రంలో సివిల్ సర్వీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత. తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నమ్రత ఎంత చెప్పినా వినకుండా డిజాస్టర్ చూసిన మహేష్ బాబు ? ఆ సినిమా చేసి తప్పు చేశాడా?
Eesha Rebba: డైరెక్టర్‌ని పెళ్లి చేసుకోబోతున్న ఈషా రెబ్బా.. అసలు కథ ఇప్పుడే స్టార్ట్