త్రివిక్రమ్, బన్నీ సినిమా షూటింగ్.. సెట్ లోకి అడుగుపెట్టిన టబు!

Published : Jul 24, 2019, 10:43 AM ISTUpdated : Jul 24, 2019, 11:07 AM IST
త్రివిక్రమ్, బన్నీ సినిమా షూటింగ్.. సెట్ లోకి అడుగుపెట్టిన టబు!

సారాంశం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్నసినిమాలో టబు కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో టబు కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.

టబు సెట్ లో స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు తీసిన వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. పూర్తి స్థాయి కుటుంబకథా చిత్రంగా రూపొందిస్తున్నారు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కనిపించబోతున్నారు. గీతాఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

బాలకృష్ణ సినిమాపై రూమర్స్.. మహేష్ బాబు మీమ్ తో డైరెక్టర్ స్ట్రాంగ్ రిప్లై , హీరోయిన్ విషయంలోనే రచ్చ
Kriti Sanon: యూకే కుర్రాడితో మహేష్ హీరోయిన్ పెళ్లి ? ఎవరీ కబీర్ బహియా.. అసలు విషయం ఇదే!