శేఖర్ మాస్టర్ తో కలిసి చిందేసిన రమ్యకృష్ణ, బన్నీ పాటకు స్టెప్పులు అదరగొట్టిన సీనియర్ హీరోయిన్

By Mahesh JujjuriFirst Published Sep 22, 2022, 9:28 PM IST
Highlights

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ స్టెప్పులేసిఅదరగోట్టారు. అది కూడా డాన్స్ మాస్టర్ శేఖర్ తో కలిసి జోర్ దార్ స్టెప్పులేశారు. డాన్స్ షో కి జడ్జిగా కొనసాగుతున్న రమ్యకృష్ణ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. 

ఒకప్పుడు టెలివిజన్ లో మాత్రమే హడావిడి చేసే డాన్స్ షోలు .. ఇప్పుడు ఓటీటీ బాటపట్టాయి. ఓటీటీలో మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతున్నాయి. అటువంటి డాన్స షోస్ లో ఆహాలో ప్రసారం అవుతున్న డాన్స్ ఐకాన్ కూడా ఒకటి.  ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ప్రసారం అవుతున్న ఈ షోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.  ఈ షోకి నటి రమ్యకృష్ణ, డాన్స్ మాస్టర్ శేఖర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ షోలో ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు సందడి చేశారు. ఇక ఈ షోకి సంబంధించి తాజా ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.  ఆ ప్రోమోలో రమ్యకృష్ణ, శేఖర్ మాస్టర్  కలిసి స్పెప్పులేసి సందడి చేశారు. అది కూడా అల్లు అర్జున్ సూపర్ హిట్ మూవీ అల వైకుంఠపురములో సినిమాలోని సామజవరాగమనా పాటకు రమ్యకృష్ణతో కలసి కాలు కదిపారు శేఖర్ మాస్టార్.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ప్రోమోకు ఈ ఇద్దరు తారల డాన్స్ వల్లే మంచి రెస్పాన్స్ వస్తోంది. 

 

ఇక ఈ శేఖర్ మాస్టర్ అలనాటి తరలతో కాలు కదుపుతున్నారు. ఆయనకు ఇది కొత్తేం కాదు. గతంలో చాలా సార్లు  డాన్స్ షోలో  శేఖర్ మాస్టర్, రోజతో కలిసి స్టెప్ లు వేశారు. అంతే కాదు రోజాతో కలిసి చాలా స్కిట్స్ కూడా చేశారు. అప్పుుడు ఆ షోలకు భారీగా  TRP రేటింగ్  పెరిగిపోయింది.దాంతో ఇప్పుడు ఈ షో మేకర్స్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. 

ఐకాన్ షో టీమ్ కూడా ఇదే స్ట్రాటజీని ప్లే చేస్తునట్టు, తాజాగా విడుదలైన ప్రోమోలో తెలుస్తుంది. మరి శేఖర్, రమ్యకృష్ణల కెమిస్ట్రీ ఈ షోకు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి. ఓంకార్ హోస్ట్ గా నిర్వహిస్తున్న ఈషోలో ముందు ముందు మరిన్ని సెలబ్రెటీల  డాన్స్ పెర్ఫామెన్స్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. 

click me!