ముప్పై ఏళ్ల తర్వాత రజినీకాంత్ మూవీతో రీఎంట్రీ... అలాంటి పాత్రలో జీవిత రాజశేఖర్!

Published : Mar 01, 2023, 07:19 AM IST
ముప్పై ఏళ్ల తర్వాత రజినీకాంత్ మూవీతో రీఎంట్రీ... అలాంటి పాత్రలో జీవిత రాజశేఖర్!

సారాంశం

నటి జీవిత రాజశేఖర్ కమ్ బ్యాక్ ప్రకటించారు. ఆమె రజినీకాంత్ లేటెస్ట్ మూవీ లాల్ సలామ్ లో నటిస్తున్నారు. జీవిత ఓ పవర్ ఫుల్ రోల్ దక్కించుకున్నారు.   


జీవిత రాజశేఖర్ మూడు దశాబ్దాల అనంతరం మేకప్ వేసుకోకున్నారు. ఆమె నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ మేరకు అధికారిక సమాచారం అందుతుంది. జీవిత రాజశేఖర్ సూపర్ స్టార్ రజినీకాంత్ సిస్టర్ రోల్ చేస్తున్నారు. కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో లాల్ సలామ్ టైటిల్ తో రజినీకాంత్ ఓ చిత్రం చేస్తున్నారు గత ఏడాది పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ మూవీ మార్చి 7 నుంచి షూటింగ్ జరుపుకోనుంది. చెన్నైలో మొదలు కానున్న మొదటి షెడ్యూల్ లో జీవిత రాజశేఖర్ కూడా పాల్గొంటున్నారు. 

లైకా ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. టైటిల్ చూస్తుంటే ఇది రివల్యూషనరీ డ్రామా అనిపిస్తుంది. ఇక హీరో సిస్టర్ పాత్ర కథలో కీలకమని తెలుస్తుండగా జీవిత రాజశేఖర్ ని ఎంచుకున్నాడు. 1990 తర్వాత ఆమె సిల్వర్ స్క్రీన్ మీద కనిపించలేదు. జీవిత చివరి చిత్రం మగాడు. రాజశేఖర్ హీరో. 1991లో రాజశేఖర్ ని వివాహం చేసుకొని నటనకు దూరమయ్యారు. వివాహం అనంతరం ఆఫర్స్ వచ్చినా రిజెక్ట్ చేశారు. ఎట్టకేలకు రజినీకాంత్ చిత్రానికి సైన్ చేశారు. 

ప్రస్తుతం ఆమె దర్శకురాలిగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆమె దర్శకత్వంలో శేషు, సత్యమేవ జయతే, మహంకాళి, శేఖర్ చిత్రాలు తెరకెక్కాయి. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. శివానీ, శివాత్మిక హీరోయిన్స్ గా రాణించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు రజినీకాంత్ నటిస్తున్న జైలర్ షూట్ చివరి దశకు చేరింది. డాక్టర్  మూవీ ఫేమ్ నెల్సన్ జైలర్ చిత్ర దర్శకుడిగా ఉన్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా... ఐశ్వర్య రాయ్ గెస్ట్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. 

జైలర్ మూవీ ఈ ఏడాది విడుదల కానుంది. సన్ పిక్చర్స్ బ్యానర్లో రూపొందుతుంది. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. రజనీకాంత్ గత చిత్రం పెద్దన్న తెలుగులో పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే తమిళంలో మంచి విజయం సాధించింది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా