స్టార్ హీరోలపై సీనియర్ నటుడు ఉత్తేజ్ కామెంట్స్!

Published : Aug 17, 2019, 09:18 AM ISTUpdated : Aug 17, 2019, 11:11 AM IST
స్టార్ హీరోలపై సీనియర్ నటుడు ఉత్తేజ్ కామెంట్స్!

సారాంశం

సీనియర్ నటుడు ఉత్తేజ్ గురించి పరిచయం అవసరం లేదు. రామ్ గోపాల్ వర్మ కాంపౌండ్ హీరోగా అందరికీ సుపరిచితం. వర్మ క్యాంపెయిన్ దర్శకులు కృష్ణవంశీ.. పూరి జగన్నాథ్ సహా పలువురు దర్శకులతో ఆయన కెరీర్ జర్నీ సాగింది.   

సీనియర్ నటుడు ఉత్తేజ్ శివ (1989) చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి అదే సినిమాలో ఓ పాత్ర కు పోషించారు. ఆ తరువాత ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సొంతంగా ఓ నటశిక్షణ సంస్థను స్థాపించి ఔత్సాహిక నటీనటులకు నటనలో మెళకువలు నేర్పిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఇండస్ట్రీలో 
వారసత్వంపై కొన్ని వ్యాఖ్యలు చేశారు.

ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో వారసత్వం అనేది చాలా కాలంగా చూస్తున్నామని.. నాగార్జున కాలం నుండి చూస్తూనే ఉన్నామని.. అయితే నటవారసులకు ఒకట్రెండు ఛాన్స్ లు మాత్రమే ఉంటాయని అన్నారు. అప్పటికి నిరూపించుకోకపోతే ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నామని అన్నారు.

ఇలా వచ్చి అలా వెళ్తున్నారని కామెంట్ చేశాడు. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ప్రవేశించిన రామ్ చరణ్ ఎంతో ప్రొఫెషనల్ గా ఉంటారని అన్నారు. తండ్రి నుండి వచ్చిన క్వాలిటీ ఇదని అన్నారు. అల్లు అర్జున్ ఒక్కో సినిమాకు తనను తాను ఉలి వేసి చెక్కుకున్నాడని ప్రశంసించారు.

రవితేజ పక్కింటబ్బాయిలా నటిస్తాడని, నాని రియలిస్టిక్ గా నటిస్తాడని అన్నారు. ఎన్టీఆర్ గురించి ప్రత్యేకించి చెబుతూ.. అతడిలో యాక్టర్ కనిపిస్తాడని అన్నారు. స్టార్ డంతో పాటు వృత్తినిబద్దత ఉన్న యాక్టర్ తనలో ఉంటాడని.. సీనియర్ ఎన్టీఆర్ ఆత్మ వచ్చి ఆయన ఉండిపోయిందేమో అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. 
  
 

PREV
click me!

Recommended Stories

Chennai Love Story 8 Days Collections: బాక్సాఫీసు వద్ద చెన్నై లవ్‌ స్టోరీ డ్రాప్‌.. కిరణ్‌ సినిమా ఎంత రాబట్టిందంటే
Lenin 22 Days Collections: లెనిన్‌ 22 రోజుల కలెక్షన్లు.. మొత్తంగా అఖిల్‌ సినిమాకి వచ్చింది ఎంతంటే? అది నిజం కాదా?