హీరోయిన్ తో సెల్ఫీ, అతన్ని ఆశ్చర్యంగా పట్టించింది

Published : Aug 25, 2019, 04:58 PM ISTUpdated : Aug 25, 2019, 05:02 PM IST
హీరోయిన్ తో సెల్ఫీ, అతన్ని ఆశ్చర్యంగా  పట్టించింది

సారాంశం

రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్ తో  కొందరు సెల్ఫీ దిగారు. ముంబై ఎయిర్ పోర్ట్ లో ఆ సంఘటన జరిగింది. ఆ సెల్ఫీ దిగేటప్పుడు ఓ వీడియో ఛానెల్ వాళ్లు వీడియో తీసి, ఆమె క్రేజ్ గురించి చెప్తూ సోషల్ మీడియాలో షేర్ చేసారు. 

కొన్ని సంఘటనలు వింటానికే విచిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా సెల్ ఫోన్ వచ్చాక ప్రపంచమే మారిపోయింది. సెల్ఫీల ప్రపంచం అయ్యిపోయింది. సెలబ్రెటీలు ఎవరైనా కనపడితే సెలఫోన్ తో  ఓ సెల్ఫీ తీసుకునేదాకా మనస్సాంతి ఉండటం లేదు. అయితే సెల్ఫీలను చాలా సార్లు విసుక్కుంటున్నా..సెల్ఫీల కోసం చేసే చేష్టలు తిట్టుకునేలా చేసినా , ఒక్కోసారి అవి బాగానే ఉపయోగపుడున్నాయి. అలా సెల్ఫీ ఓ మిస్సైన కుర్రాడిని తన కుటుంబానికి పట్టించింది. 

రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్ తో  కొందరు సెల్ఫీ దిగారు. ముంబై ఎయిర్ పోర్ట్ లో ఆ సంఘటన జరిగింది. ఆ సెల్ఫీ దిగేటప్పుడు ఓ వీడియో ఛానెల్ వాళ్లు వీడియో తీసి, ఆమె క్రేజ్ గురించి చెప్తూ సోషల్ మీడియాలో షేర్ చేసారు. అయితే ఆ వీడియోలో సారా తో సెల్పీ ప్రయత్నించిన కుర్రాడు పేరు అజయ్. అతను పదవతరగతి ఫెయిల్ అవటంతో ఇంట్లో వాళ్ల భయింతో పారిపోయారు. ఆ తర్వాత అతని తండ్రి ఎంత ప్రయత్నించినా ఎడ్రస్ దొరకలేదు. మధ్య ప్రదేశ్ లో ఓ చిన్న టౌన్ వాళ్లది. వాళ్లు ఈ వీడియోని చూడటం తటస్దించింది. తమ కుమారుడు ఎక్కడో చోట ఉన్నాడని సంతోషపడ్డారు. 

అయితే అజయ్ తండ్రి అంతకు ముందే తమ కుమారుడు స్వరూప్ సింగ్ మిస్సయ్యాడని కంప్లైంట్ ఇఛ్చాడు. దాంతో లోకల్ పోలీస్ లు ఆ వీడియో ఆధారం చేసుకుని ఆ కుర్రాడిని వెతికి ఇంటికి తేవటానికి ముంబై వెళ్లారు. మొత్తానికి హీరోయిన్ తో సెల్ఫీ తన కుటుంబానికి అతన్ని పట్టించింది. 

 

PREV
click me!

Recommended Stories

Chaitra Rai Remuneration: ఐదు రోజులకు చైత్ర రాయ్‌ ఎంత పారితోషికం అందుకుందో తెలుసా?.. ఆ భ్రమలకు ఫుల్‌ స్టాప్‌
Box Office Clash: బాక్సాఫీస్ వద్ద సర్దార్ 2కు షాకిచ్చిన చిన్న సినిమా... వసూళ్లలో సూరిదే పైచేయి!