మహేష్ తో పక్కా.. అర్జున్ రెడ్డి డైరెక్టర్

By Prashanth MFirst Published Jul 11, 2019, 7:55 AM IST
Highlights

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు - అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. కానీ రీసెంట్ గా మహేష్ మనసుకి మార్చుకున్నట్లు అలాగే సందీప్ వేరే హీరో కోసం వెతుకుతున్నట్లు కూడా రూమర్స్ వినిపించాయి.

మొన్నటి వరకు బాలీవుడ్ కబీర్ సింగ్ తో బిజీగా ఉన్న దర్శకుడు సందీప్ ఇప్పుడు కాస్త ఫ్రీ అయ్యాడు. ఇక తన ద్రుష్టి మొత్తం నెక్స్ట్ ప్రాజెక్ట్ పై పెట్టనున్నాడు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ తో సినిమా తప్పకుండా చేస్తానని చెప్పిన సందీప్ గతంలో ఆయనని కలిసినప్పుడు ఒక లైన్ వినిపించగా సూపర్ స్టార్ కి బాగా నచ్చేసిందని చెప్పాడు. 

ప్రస్తుతం ఆ కాన్సెప్ట్ కి సంబందించిన ఫుల్ స్క్రిప్ట్ పనులు ఎండ్ చేసే పనిలో ఉన్నట్లు చెబుతూ త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయని అన్నారు. ఇక మహేష్ ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరూ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు.   

click me!