సమంత, నందిని రెడ్డి సినిమా అప్డేట్!

Published : Dec 06, 2018, 01:31 PM IST
సమంత, నందిని రెడ్డి సినిమా అప్డేట్!

సారాంశం

వివాహం జరిగిన తరువాత సమంత కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ హీరోయిన్ గా కాకుండా సరికొత్త కథలను ఎన్నుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది. 

వివాహం జరిగిన తరువాత సమంత కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ హీరోయిన్ గా కాకుండా సరికొత్త కథలను ఎన్నుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది. 'యూటర్న్' సినిమాతో సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ తాజాగా దర్శకురాలు నందిని రెడ్డితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అంతేకాదు ఈ సినిమా షూటింగ్ మొదలై వారం రోజులు అవుతోంది. కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ' సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారని సమాచారం. హైదరాబాద్ రవీంద్రభారతిలో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తోన్న నాగశౌర్య సైతం షూటింగ్ లో పాల్గొంటున్నాడని తెలుస్తోంది. కథ ప్రకారం సినిమాలో సమంత డ్యుయల్ రోల్ లో కనిపించనుంది. ఇంకా ఈ సినిమా టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సునీత తాటి నిర్మిస్తోన్న ఈ సినిమాలో సురేష్ బాబు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని తెలుస్తోంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

PREV
click me!

Recommended Stories

Kareena Kapoor: 45 ఏళ్ల వయసులో కరీనా కపూర్ మళ్లీ ప్రెగ్నెంటా..? జిమ్ వీడియోతో మొదలైన కొత్త చర్చ
Express Hari Marriage: హీరోయిన్‌ను పెళ్లాడబోతున్న ఎక్స్‌ప్రెస్ హరి! వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత?