`ఖుషి`లో సమంత ఫస్ట్ లుక్‌.. అప్పటి రోజులను గుర్తు చేస్తుందిగా!

Published : Apr 28, 2023, 06:58 PM IST
`ఖుషి`లో సమంత ఫస్ట్ లుక్‌.. అప్పటి రోజులను గుర్తు చేస్తుందిగా!

సారాంశం

స్టార్‌ హీరోయిన్‌ సమంత నేడు పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న `ఖుషి` చిత్రంలోని ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇది వైరల్‌ అవుతుంది.

సమంత ఒక ఇన్‌స్పైరింగ్‌ లేడీ. ఆమె అనారోగ్యంపై ఎన్ని నెగటివ్ కామెంట్లు వచ్చినా, ఆమె పోరాడి గెలిచిన నాయిక. నేటి మహిళలకు, అమ్మాయిలకు సమంత ఒక స్ఫూర్తి. ఇప్పటికీ ఆమె మానసికంగా ఇబ్బంది పడుతూనే ఉంది. కానీ దాన్ని అంతే ఓర్పుతో ఎదుర్కొంటుంది. ముందుకు సాగుతుంది. ఫ్యామిలీ పరంగా, ఆరోగ్య పరంగా, సినిమాల పరంగా దెబ్బ మీద దెబ్బ పడినా వాటిని ఎంతో సహనంతో ఫేస్‌ చేస్తుంది. అందుకే ఇప్పుడు సమంత.. ఇన్‌స్పైరింగ్‌ లేడీ అని చెప్పొచ్చు. 

ఇక నేడు శుక్రవారం(ఏప్రిల్‌ 28)న సమంత తన పుట్టిన రోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆమె ప్రస్తుతం నటిస్తున్న `ఖుషి` సినిమా నుంచి అప్‌ డేట్‌ ఇచ్చింది యూనిట్‌. `ఖుషి` సినిమా నుంచి సమంత ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది. ఇందులో ఆమె సాఫ్ట్ వేర్‌ అమ్మాయిలా కనిపిస్తుంది. బ్లూ టాప్‌, టైట్‌ జీన్స్ ధరించింది. చాలా యంగ్‌గా ఆకట్టుకునేలా ఉంది. ఓ కొత్త సమంతని చూసినట్టుగా ఉంది. అంతేకాదు కెరీర్‌ బిగినింగ్‌లో తన సినిమాలను తలపించేలా ఉంది. చాలా రోజుల తర్వాత ఇలాంటి లుక్‌లో కనిపించడంతో సమంత ఈజ్‌ బ్యాక్‌ అంటున్నారు నెటిజన్లు. 

ఇక `ఖుషి` సినిమా విషయానికి వస్తే, సమంత అనారోగ్యం కారణంగా సినిమా షూటింగ్‌ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆమె కోలుకున్నాక ఇటీవల తిరిగి ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభించారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సమంత ఆయనకు జోడీగా చేస్తుంది. ఓ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా, డ్రామా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తుంది. అయితే పవన్‌ కళ్యాణ్‌ నటించిన `ఖుషి` సినిమాకి, ఈ `ఖుషి`కి కూడా కంటెంట్‌ పరంగా పోలికలుంటాయని, ముఖ్యంగా ఈగో అంశాలు దగ్గరగా ఉంటాయని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న `ఖుషి` ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ జరుపుకుంటోంది. సెప్టెంబర్‌ 1న ప్రపంచ వ్యాప్తంగా పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల చేయబోతున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత ఇప్పటికే `మజిలీ` చిత్రంలో నటించారు. అందులో నాగచైతన్య హీరో. పెళ్లి తర్వాత ఈ ఇద్దరు కలిసి నటించిన చిత్రం. పెద్ద హిట్‌ అయ్యింది. ఇక సమంత ఇటీవల `శాకుంతలం` చిత్రంలో నటించింది. కానీ ఇది డిజాస్టర్‌గా నిలిచింది. అంతకు ముందు నటించిన `యశోద` సినిమా యావరేజ్‌ ఫలితాన్ని సాధించింది. ప్రస్తుతం సమంత హిందీలో `సిటాడెల్‌` వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Avatar 3 Review: అవతార్‌ 3 మూవీ రివ్యూ, రేటింగ్‌.. జేమ్స్ కామెరూన్‌ ఇక ఇది ఆపేయడం బెటర్‌
Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్