2కోట్ల డీల్.. టెంప్ట్‌వ్వని సాయిపల్లవి!

Published : May 27, 2019, 10:12 AM IST
2కోట్ల డీల్.. టెంప్ట్‌వ్వని సాయిపల్లవి!

సారాంశం

  సౌత్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అందుకున్న సాయి పల్లవి ఎప్పుడు కూడా అవకాశాల వైపు అడుగు వేయదు. అవకాశాలే ఆమె వైపు పరిగెత్తుకుంటూ వస్తాయ్. సొంత టాలెంట్ ని నమ్ముకొని కష్టపడే అమ్మడు కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉంటుంది. 

సౌత్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ అందుకున్న సాయి పల్లవి ఎప్పుడు కూడా అవకాశాల వైపు అడుగు వేయదు. అవకాశాలే ఆమె వైపు పరిగెత్తుకుంటూ వస్తాయ్. సొంత టాలెంట్ ని నమ్ముకొని కష్టపడే అమ్మడు కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉంటుంది. చేసిన ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్తదనం ఉండేలా జాగ్రత్తలు తీసుకునే బేబీ రీసెంట్ ఒక డీల్ కు నో చెప్పింది. 

ఈ రోజుల్లో డబ్బులకు ఆశపడి చాలా మంది స్టార్స్ యాడ్స్ లో నటిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు అనే ఆఫర్స్ కి ఎవ్వరైనా టెంప్ట్‌ అవ్వకుండా ఉండలేరు. కానీ మనస్ఫూర్తిగా సిద్ధాంతాలను నమ్ముతూ నటించేవారు అసలు వాటి జోలికే వెళ్లరు. అందులో సాయి పల్లవి కూడా ఒకరు. 2 కోట్ల అఫర్ ను సాయి పల్లవి ముందు ఉంచిన ఒక ఫెయిర్ నెస్ కంపెనీకి చేదు అనుభవం ఎదురైంది. 

ఫెయిర్ నెస్ క్రీమ్ లను ప్రమోట్ చేసి వాటి వల్ల అందం పెరుగుతుందని జనాలను నమ్మించడం తనకు ఇష్టం ఉండదని చాలా సార్లు ఇంటర్వ్యూల్లో చెప్పింది. అసలైతే గతంలోనే ఒక అఫర్ ను తిరస్కరించిన సాయి పల్లవి మరోసారి అదే న్యూస్ తో వైరల్ అయ్యింది. రీసెంట్ గా కోటి ఇస్తామని మొదట చెప్పిన ఒక కంపెనీ 2 కోట్ల వరకు ఆ డీల్ ను తీసుకెళ్లి సాయి పల్లవి ముందు ఉంచగా ఆమె చేయనని ఆ అఫర్ ను వదులుకుంది. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar: 1000 కోట్ల క్లబ్ లో ధురంధర్..ఈ ఫీట్ సాధించిన 9 సినిమాలు ఇవే, 4 టాలీవుడ్ నుంచే
Jabardasth : ఈగో వల్ల జబర్దస్త్‌ ను వదిలి వెళ్లిపోయిన స్టార్ కమెడియన్ ఎవరో తెలుసా?