FMGE పరీక్ష రాసిన సాయి పల్లవి.. పాసైతే...

By Surya PrakashFirst Published Sep 2, 2020, 4:35 PM IST
Highlights

 తన డాన్స్‌తో, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన  హీరోయిన్ సాయి పల్లవి. సినిమాల్లోకి అరంగేట్రం చేసే సమయానికే విదేశాల్లో డాక్టర్ కోర్స్ ను అభ్యసించారు.

చాలా మంది డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాను అని చెప్తూంటారు. కానీ నిజానికి సాయి పల్లవి మాత్రం డాక్టర్ అవ్వాలనే కోరిక తీర్చుకునే యాక్టర్ అయ్యిందని చెప్పాలి. తన డాన్స్‌తో, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన  హీరోయిన్ సాయి పల్లవి. సినిమాల్లోకి అరంగేట్రం చేసే సమయానికే విదేశాల్లో డాక్టర్ కోర్స్ ను అభ్యసించారు.

ఓ వైపు సినిమాలు చేస్తూనే వైద్య విద్యను పూర్తి చేసే విషయంపై దృష్టిపెట్టారు. ఆమె తన చదువును ఇటీవల పూర్తి చేశారు. అయితే విదేశాల్లో మెడిసిన్ పూర్తి చేసే విద్యార్థులు భారత్‌లో మెడికల్ బోర్డు నిర్వహించే పరీక్షను తప్పకుండా పాస్ కావాల్సి ఉంటుంది.

విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసిన సాయి పల్లవి ఇటీవల నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ నిర్వహించే ఫారీన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ( FMGE)పరీక్షకు హాజరయ్యారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో డాక్టర్‌గా రిజిస్టర్ చేసుకోవాలంటే ఈ పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తిరుచిలోని (MAM college)ఎంఏఎం కాలేజీలో జరిగిన పరీక్షకు హాజరయ్యారు.

కెరీర్ విషయానికి వస్తే...నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘లవ్‌ స్టోరీ’. ఎమిగోస్‌  క్రియేషన్స్, సోనాలి నారంగ్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై నారాయణ్‌ దాస్‌ కె.నారంగ్, పి.రామ్మోహన్‌ రావు నిర్మిస్తున్నారు.

 ‘‘15 రోజులు  షూటింగ్‌ మినహా సినిమా పూర్తయింది. కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టాక షూటింగ్ ప్రారంభిస్తాం. సరైన సమయంలో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సహనిర్మాత: భాస్కర్‌ కటకంశెట్టి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఐర్ల నాగేశ్వర రావు.
 

click me!