నా టాంగో నన్ను విడిచి వెళ్ళిపోయింది.. సాయిధరమ్ తేజ్ ఎమోషనల్ పోస్ట్..

Published : Jun 13, 2023, 01:44 PM IST
నా టాంగో నన్ను విడిచి వెళ్ళిపోయింది.. సాయిధరమ్ తేజ్ ఎమోషనల్ పోస్ట్..

సారాంశం

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ అయ్యారు. తాను ఎంతో ప్రేమగా చూసుకునే జీవి మరణించడంతో ఆయన తట్టుకోలేకపోయారు.

సెలబ్రిటీలు చాలామందికి పెంపుడు జంతువులు అంటే ప్రాణం. వాటిని సోంత వారిలా ప్రేమిస్తారు. వారికి ఏమైన అయితే అస్సలు భరించలేవరు. వాటితో గడిపిని క్షణాలను సోషల్ మీడియాలో కూడా పంచుకుంటారు. అటువంటిది అవి దూరం అయితే ..ఆ బాధను తట్టుకోవడం కష్టమనే చెప్పాలి. మరీ ముఖ్యంగా  పలువురు సెలబ్రిటీలు కుక్కలని పెంచుకుంటూవాటితో ప్రత్యేక బంధాన్ని ఏర్పాటు చేసుకుంటుంటారు.  సెలబ్రిటీలు చాలామంది  కుక్కలని పెంచుతూ వాటిని తమ ఫ్యామిలీ మెంబర్స్ లా చూస్తారు. 

ఈక్రమంలో మెగా మేనల్లుడు.. సుప్రీమ్ హీరో  సాయి ధరమ్ తేజ్ కూడా ఎప్పట్నుంచో ఓ కుక్కని పెంచుకుంటున్నారు. తేజ్ తన కుక్కకు టాంగో పేరు కూడా  పెట్టాడు. ఆ కుక్క అంటే సాయి తేజ్ కు చాలా ఇష్టం. ఇంట్లో ఉన్నప్పుడు చాలా టైమ్ ను ఆ కుక్కతోనే  స్పెండ్ చేసేవారు. అంతే కాదు తన కుక్క టాంగోతో కలిసి ఎంజాయ్ చేస్తున్న పలు ఫోటోలను కూడా ఆయన  సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

 

 

తాజాగా తన కుక్క టాంగో చనిపోవడంతో చాలా బాధపడ్డారు సాయి తేజ్.  తన కుక్కతో ఉన్న అనుబంధాన్నిగుర్తు చేసుకుంటూ...  సోషల్ మీడియాలో పోస్ట్ ను  షేర్ చేసుకున్నాడు. తన కుక్క చిన్నగా ఉన్నప్పుడు మొదటిసారి తీసుకున్న ఫోటోతో పాటు ఓ ఎమోషనల్ లెటర్ షేర్ చేశాడు తేజ్. ఈ లెటర్ లో..  తన బాధనంటతిని వ్యాక్త పరుస్తూ..ఓ పెద్ద నోట్ ను రాశారు. ప్రస్తుతం ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇంతకీ ఆ నోట్ లో సాయి తేజ్ ఏమని రాశారంటే..? నిన్ను తలుచుకున్నప్పుడు నా మనసు ఆనందంగా ఉంటుంది. నువ్వు లేకపోతే చాలా కష్టంగా ఉంది. నన్ను నువ్వు రక్షించావు, నవ్వించావు. నా కష్టాల్లోనూ, నా సంతోషాల్లోనూ నువ్వు నాతో ఉన్నావు. నాకు ఎంతో ప్రేమను ఇచ్చిన నిన్ను పొందడం నా అదృష్టం. నువ్వు నా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు ఇప్పటికి స్పెషల్ మూమెంట్ లాగా గుర్తుంది. లవ్ యు మై బండ ఫెలో.. టాంగో.. అంటూ రాశాడు తేజ్. దీంతో పలువురు అభిమానులు, నెటిజన్లు కూడా బాధగా కామెంట్స్ చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?