సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాకు సీక్వెల్..? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Published : Apr 24, 2023, 01:25 PM ISTUpdated : Apr 24, 2023, 01:33 PM IST
సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాకు సీక్వెల్..? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

సారాంశం

సూపర్ సక్సెస్ సాధించింది సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష. మెగా హీరో ఆనందానికి హద్దులు లేవు. ఇక ఈసినిమాకు సీక్వెల్ గా మరో మూవీ రాబోతోందా..? ఈ విషయంలో డైరెక్టర్  కార్తీక్ దండు ఏమన్నారు.   

టాలీవుడ్ సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కాస్త గ్యాప్ తీసుకుని  నటించిన సినిమా  విరూపాక్ష. సుకుమార్ డైరెక్షన్ స్కూల్ నుంచి వచ్చిన కార్తీక్ దండు తెరెక్కించిన ఈసినిమా..  పాజిటీవ్ టాక్‌ను సొంతం చేసుకుని.. దూసుకుపోతోంది.  సంయుక్తా మీనన్ సాయి తేజ్ కు జంటగా నటించిన ఈసినిమా శుక్రవారం (ఏప్రిల్ 21న) రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురుపిస్తున్న నేపథ్యంలో మెగా హీరో తన దర్శకుడితో కలిసి సంబరాలు చేసుకున్నారు. అటు మెగా ప్యామిలీ కూడా సంబరాలు చేసుకున్నారు. 

ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించి .. మరో అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీ సిక్వెల్‌పై ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ దర్శకుడు కార్తీక్ దండు అభిమానులకు క్లారిటీ ఇవ్వడంతో పాటు ఓ  గుడ్ న్యూస్ కూడా చెప్పారు. ఓ టీవీ చానెల్ ఇంటర్వూలో  మాట్లాడిన కార్తీక్ దండు.. ఓ ప్రేక్షకుడు  అడిగిప్రశ్నకు జావాబు చెప్పారు. విరూపాక్ష కు సీక్వెల్ వస్తుందా అని అతను అడగా..  దీనిపై కార్తీక్ స్పందిస్తూ.. ఇప్పటికైతే అనుకోలేదు. నేను, సుకుమార్ ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా సీక్వెల్ ఉంటుంది. కానీ, వెంటనే రాకపోవచ్చు అని తెలిపారు. 

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన విరూపాక్ష కేవలం తెలుగు,తమిళ భాషల్లోనే రిలీజ్ చేశారు. ఇక్కడ రెస్పాన్స్ ను బట్టి.. ఇతర భాషల్లో రిలీజ చేయబోతున్నట్టు తెలుస్తోంది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే 18 కోట్ల క్లబ్‌లోకి చేరింది ఈ మూవీ. ఒక్ నిజాంలోనే 4.53 కోట్లు వసూళ్లు చేసింది ఈ మూవీ. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ పతాకాలపై బాపినీడు బి సమర్పణలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ విరూపాక్ష సినిమాను నిర్మించారు.

ఈసినిమా సక్సెస్ తో మెగా ఫ్యామిలీ పండగ చేసుకుంటుంది. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ ను ఇంటికి పిలిచి  కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. సక్సెస్ కు విషెష్ తెలియజేస్తూ.. రామ్ చరణ్ ట్వీట్ కూడాచేశారు. అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కూడా సాయి ధరమ్ తేజ్ ను విష్ చేశారు. మరో వైపు కల్యాణ్ రామ్ కూడా సాయి తేజ్ నుఅభినందిస్తూ.. ట్వీట్ చేశారు. ఇలా సెలబ్రిటీస్ కూడా విరూపాక్ష మూవీపై ప్రసంసలు కురిపిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?