సాహో - RRR ఓవర్సీస్ రైట్స్.. మైండ్ బ్లోయింగ్!

By Prashanth MFirst Published Jun 13, 2019, 12:57 PM IST
Highlights

టీజర్ తో సాహో తన స్టామినా ఏమిటో చెప్పేసింది. ఇక బిజినెస్ లెక్కలే అసలు స్టామినాను చూపించాలి. ఆ లెక్కల్లో జక్కన్న RRR ఓ మెట్టు పైనే ఉంది. రామ్ చరణ్ - తారక్ కావున ఆ బిజినెస్ వేరు. ఈ రెండు సినిమాలు డిఫరెంట్ జానర్ లో తెరకెక్కుతున్నప్పటికీ ఎక్కువ టార్గెట్ చేసింది యాక్షన్ ప్రియులనే. 

భారీ విజువల్స్ తో యాక్షన్ ట్రీట్ ఇచ్చి.. అందులో మసాలా లాంటి ఎమోషన్ ని జోడిస్తే ఆ కిక్కే వేరు. పరదేశియులకు కూడా ఇలాంటి ఫుల్ మీల్స్ తెగ నచ్చేస్తున్నాయి. అసలు విషయంలోకి వస్తే.. బారి బడ్జెట్ తో రూపొందుతున్న ఈ రెండు సినిమాల ఓవర్సీసీ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి. 

సాహో ఇప్పటికే అన్ని ఏరియాల బిజినెస్ లను క్లోజ్ చేసింది. ఓవర్సీస్ రైట్స్ ద్వారా సాహో టీమ్ 43కోట్లను అందుకున్నారు. ఇక RRR స్టార్ స్టామినాతో రూపొందుతున్న మల్టీస్టారర్ కావున 65కోట్లకు డీల్ సెట్టయినట్లు సమాచారం. ఒక్క చైనాలో తప్పా ఈ రెండు సినిమాల బిజినెస్ వరల్డ్ వైడ్ అంతటా క్లోజ్ అయినట్టే. సాహూ ఆగస్ట్ 15న వస్తుండగా RRR 2020 జులై 30న రిలీజ్ కానుంది. 

click me!