సాహో సర్‌ప్రైజ్ పోస్టర్.. రిలీజ్ డేట్ ఫిక్స్!

Published : May 21, 2019, 12:46 PM ISTUpdated : May 21, 2019, 12:48 PM IST
సాహో సర్‌ప్రైజ్ పోస్టర్.. రిలీజ్ డేట్ ఫిక్స్!

సారాంశం

ప్రభాస్ కెరీర్ లో మరో భారీ బడ్జెట్ సినిమా సాహో కోసం అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే నిన్న ఒక స్పెషల్  సర్‌ప్రైజ్ ఉంటుందని చెప్పిన డార్లింగ్ ఎట్టకేలకు నేడు సాహో అఫీషియల్ లుక్ ని వదిలాడు. 

డిఫరెంట్ కళ్లజోడు పెట్టుకున్న ప్రభాస్ దానికి ఒక స్పై కామ్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా సీరియస్ గా యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నాడు. హాలీవుడ్ స్టైల్ లో దర్శకుడు సుజీత్ సినిమాను తెరకెక్కించినట్లు షూటింగ్ ఫోటోలను చుస్తేనే అర్ధమవుతోంది. ఇక సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే సందేహానికి కూడా పోస్టర్ తో ఆన్సర్ ఇచ్చేశారు. 

ఆగస్ట్ 15న సినిమా వరల్డ్ వైడ్ గా తెలుగు - తమిళ్ - హిందీలో భారీగా రిలీజ్ కాబోతోంది. బాహుబలి అనంతరం ప్రభాస్ చేస్తోన్న సినిమా కావడంతో బాలీవుడ్ జనాలు కూడా సాహో సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా