'సాహో' ట్రైలర్.. ఫ్యాన్స్ కి విజువల్ ఫీస్ట్!

Published : Aug 10, 2019, 05:14 PM IST
'సాహో' ట్రైలర్.. ఫ్యాన్స్ కి విజువల్ ఫీస్ట్!

సారాంశం

ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని కళ్లలో ఒత్తులేసుకొని ఎదురుచూస్తున్న క్షణం రానేవచ్చింది. బాహుబలి 2 సినిమా తర్వాత ప్యాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తీసిన ఫుల్ లెంగ్త్ యాక్షన్ చిత్రం సాహో...ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. 

భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ తరహాలో తెరకెక్కుతున్న 'సాహో' ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటివరకు పోస్ట్-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ ఇప్పుడు ప్రమోషన్‌పై దృష్టి పెట్టింది.

తాజాగా సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఇప్పుడీ ట్రైలర్ ట్రెండింగ్ గా మారింది. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ ఇంత వరకూ ఇండియన్ స్క్రీన్ పై కనిపించలేదంటే...అతిశయోక్తి కాదు.

''ముంబై లో రెండు వేల కోట్ల రాబరీ జరిగింది.. అది చేసిందెవరో.. మనకి తెలియదంటూ'' పోలీసులు చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. ఆ తరువాత ''ఈ కేసుని ఒక అండర్ కవర్ ఆఫీసర్ హ్యాండిల్ చేస్తాడంటూ'' డైలాగ్ చెప్పగానే ప్రభాస్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. 

హీరోయిన్ శ్రద్ధాకపూర్.. అమృతానాయర్ అనే క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ గా కనిపించనుంది. ట్రైలర్ చివరిలో ''గల్లీలో సిక్స్ ఎవడైనా.. కొడతాడు.. స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్  ఉంటుంది..'' అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2: అఖండ 2 సంక్రాంతికి వస్తే ఎవరికి నష్టం ? ఒకవైపు ప్రభాస్, మరోవైపు చిరంజీవి.. జరిగేది ఇదే
Prabhas: దేశముదురు దెబ్బకి అడ్రస్ లేకుండా పోయిన ప్రభాస్ సినిమా..ఒకే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్