90ML ఫస్ట్ లుక్.. మందు బాటిళ్లపై లవర్ బాయ్

Published : Sep 09, 2019, 05:13 PM ISTUpdated : Sep 09, 2019, 05:14 PM IST
90ML ఫస్ట్ లుక్.. మందు బాటిళ్లపై లవర్ బాయ్

సారాంశం

90ML సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన కార్తికేయ ఓ వర్గం ఆడియెన్స్ స్ట్రాంగ్ గా ఎట్రాక్ట్ చేస్తున్నాడు. చుట్టూ మందు సీసాలతో పడుకున్నట్లు కనిపిస్తూ అధికారిక తాగుబోతు అని ఇంగ్లీష్ లో ఒక డిఫరెట్ ట్యాగ్ ఇచ్చాడు.

ఆర్ఎక్స్100 సినిమాతో ఎవరు ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న యువ హీరో కార్తికేయ ఆ తరువాత అనుకున్నంతగా సక్సెస్ అందుకోలేకపోయాడు. హిప్పీ - గుణ 369 సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక ఇప్పుడు ఎలాగైనా అభిమానులను మెప్పించి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని మరొక డిఫరెంట్ ప్రాజెక్ట్ తో సిద్దమవుతున్నాడు. 

90ML సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన కార్తికేయ ఓ వర్గం ఆడియెన్స్ స్ట్రాంగ్ గా ఎట్రాక్ట్ చేస్తున్నాడు. చుట్టూ మందు సీసాలతో పడుకున్నట్లు కనిపిస్తూ అధికారిక తాగుబోతు అని ఇంగ్లీష్ లో ఒక డిఫరెట్ ట్యాగ్ ఇచ్చాడు. అశోక్ రెడ్డి గుమ్మ కొండా నిర్మిస్తున్న ఈ సినిమాకు శేఖర్ రెడ్డి యెర్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక సినిమా ఫస్ట్ లుక్ ఆడియెన్స్ కి నచ్చడంతో టీజర్ ఎలా ఉంటుందా అనే అనే సందేహాలు వెలువడుతున్నాయి. 

ఆర్ఎక్స్ 100 సినిమాకు పనిచేసిన కొంతమంది టెక్నీషియన్స్  ఈ సినిమాకు కూడా పనిచేశారు. ఇప్పటివరకు ఎవరు చూపించని ఒక కొత్త పాయింట్ సినిమాలో చూపించనున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. మరి లవర్ బాయ్ గా క్లిక్కయిన కార్తికేయ ఇప్పుడు 90ML కాన్సెప్ట్ తో తాగుబోతుగా ఎంతవరకు క్లిక్కవుతాడో చూడాలి. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode:దీప, శౌర్యలపై పారు ప్రేమ-దీప చావుకు ప్లాన్-నిజం తెలుసుకున్న కార్తీక్
Illu Illalu Pillalu April 2 Episode: వల్లి బాగోతం మొత్తం బట్టబయలు.. ఇంటి నుంచి గెంటేసిన చందు