సీతతో రాంచరణ్ తొలిసారి.. అజయ్ దేవగన్ గురించి అది నిజమేనా!

Published : Jul 07, 2019, 04:34 PM IST
సీతతో రాంచరణ్ తొలిసారి.. అజయ్ దేవగన్ గురించి అది నిజమేనా!

సారాంశం

మెగా పవర్ స్టార్ రాంచరణ్, అందాల తార అలియా భట్ తొలిసారి కలసి సందర్భం వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో వీరిద్దరూ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

మెగా పవర్ స్టార్ రాంచరణ్, అందాల తార అలియా భట్ తొలిసారి కలసి సందర్భం వచ్చేసింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో వీరిద్దరూ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల రాజమౌళి అండ్ టీం హైదరాబాద్ లో కీలకమైన షెడ్యూల్ పూర్తి చేశారు. తదుపరి షెడ్యూల్ పూణే, అహ్మదాబాద్ నగరాలలో జరగనుంది. వాస్తవానికి ఈ షెడ్యూల్ గతంలోనే జరగాల్సింది. 

కానీ షెడ్యూల్ కు ముందు రాంచరణ్ గాయానికి గురికావడంతో వాయిదా పడింది. రాజమౌళి క్రమంగా ప్రధాన పాత్రలన్నింటిని రంగంలోకి దించుతున్నాడు. పూణే పూణే, అహ్మదాబాద్ నగరాలతో పాటు నార్త్ ఇండియాలో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ రెండు నెలల లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోహ్ణది. 

వచ్చే వారం పుణేలో ప్రారంభం కాబోయే ఈ షెడ్యూల్ లో అలియా భట్ జాయిన్ కాబోతోంది. అలియా ఈ చిత్రంలో రామరాజు మరదలు సీత పాత్రలో నటిస్తోంది. అలియా భట్ పాత్ర ఈ చిత్రానికి చాలా కీలకం అని రాజమౌళి ఇదివరకే ప్రకటించారు. 

ఈ షెడ్యూల్ లోనే అజయ్ దేవగన్ కూడా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. అజయ్ దేవగన్ పాత్ర గురించి బాలీవుడ్ మీడియాలో ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. అజయ్ దేవగన్ ఈ చిత్రంలో రాంచరణ్ కు తండ్రిగా నటిస్తున్నాడనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవమో వేచి చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా