టైగర్ కేసీఆర్: బయోపిక్ టైటిల్ రిలీజ్ చేసిన వర్మ!

Published : Apr 18, 2019, 01:38 PM ISTUpdated : Apr 18, 2019, 01:40 PM IST
టైగర్ కేసీఆర్: బయోపిక్ టైటిల్ రిలీజ్ చేసిన వర్మ!

సారాంశం

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టుగానే కేసీఆర్ బయోపిక్ ను తీసేలా ఉన్నాడు. అందుకు సంబందించిన ఎనౌన్స్మెంట్ తో ఇటీవల రచ్చ చేసిన వర్మ ఫైనల్ గా టైటిల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టుగానే కేసీఆర్ బయోపిక్ ను తీసేలా ఉన్నాడు. అందుకు సంబందించిన ఎనౌన్స్మెంట్ తో ఇటీవల రచ్చ చేసిన వర్మ ఫైనల్ గా టైటిల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశాడు. కేసీఆర్ టైగర్ అని సెట్ చేసిన టైటిల్ కు మంచి క్యాప్షన్ కూడా ఇచ్చాడు. 

ధ అగ్రెసివ్ గాంధీ అనే క్యాప్షన్ తో పాటు చిన్న లైన్ తో స్ట్రాంగ్ గా ఎట్రాక్ట్ చేశాడు. 'ఆడు తెలంగాణ తెస్తానంటే.. అందరూ నవ్విండ్రు' అని కేసీఆర్ డైలాగ్ నే పెట్టడంతో ఈ న్యూస్ అందరిని ఆకట్టుకుంటోంది. వర్మకు టైటిల్స్ వదలడం కొత్తేమి కాదు. గతంలో కూడా చాలా మంది ప్రముఖుల బయోపిక్స్ తీస్తాను అని అప్పటికప్పుడు పోస్టర్ లతో హంగామా చేసేవారు. 

అయితే కేసీఆర్ బయోపిక్ లో మాత్రం వర్మ మొండి పట్టు పట్టాడని తెలుస్తోంది. మరి తెలంగాణ ముఖ్యమంత్రి జీవితాన్ని తెరపైకి తెరకెక్కించే ముందు దర్శకుడు ఎలాంటి ఆలోచనలతో ముందుకు వెళతాడో చూడాలి.  

PREV
click me!

Recommended Stories

ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? మళ్లీ సినిమాల్లో రావాలని ఫ్యాన్స్ డిమాండ్
త్రిష ,కాజల్ తో పాటు బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్లుగా కెరీర్ మొదలుపెట్టిన, 8 మంది స్టార్స్ ఎవరో తెలుసా?