రేణూదేశాయ్‌ ఆరోగ్యం ఎలా ఉంది?

Published : Sep 15, 2019, 03:14 PM ISTUpdated : Sep 15, 2019, 04:20 PM IST
రేణూదేశాయ్‌ ఆరోగ్యం ఎలా ఉంది?

సారాంశం

 ప్రముఖ నటి, దర్శకురాలు రేణూదేశాయ్‌ డెంగీ బారినపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా రేణూ తెలిపారు.

ప్రముఖ నటి, దర్శకురాలు రేణూదేశాయ్‌ డెంగీ బారినపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా రేణూ తెలిపారు. అంతేకాకుండా జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ప్రతిఒక్కరికి వివరించారు. డెంగీ జ్వరం నుంచి కోలుకుంటున్న సమయంలో షూటింగ్‌ చేయాల్సి వచ్చినప్పుడు నేను ఇలా ఉన్నాను అంటూ ఓ ఫొటో పోస్టు చేశారు. ‘

‘ఈటీవీలో ప్రసారం చేయబోయే ‘ఢీ ఛాంపియన్‌’ షో కోసం కొన్ని గంటలపాటు షూటింగ్‌కి నేను నో చెప్పలేకపోయాను. దోమల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. పొడవైన దుస్తులనే వాడండి’’ అని రేణూ పేర్కొన్నారు. అభిమానులంతా ఆమె కోలుకోవాలని కోరుకుంటున్నారు.

ఇక సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న తర్వాత రేణూ దేశాయ్‌ బుల్లితెరలో ప్రసారమయ్యే రియాల్టీషోలలో కనపడుతున్నారు. త్వరలో ఆమె రైతుల నేపథ్యంలో తెరకెక్కించే సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Priyanka Chopra: స్వర్ణ దేవాలయంలో సేవ.. పాత్రలు కడిగిన గ్లోబల్ బ్యూటీ..
అప్పులున్నవారికి ధైర్యాన్నిచ్చే సినిమా, కార్మేని సెల్వం కాన్సెప్ట్ ఏంటంటే?