హీరోతో డేటింగ్ పై రెజీనా క్లారిటీ!

Published : Apr 08, 2019, 10:12 AM IST
హీరోతో డేటింగ్ పై రెజీనా క్లారిటీ!

సారాంశం

గత కొద్దిరోజులుగా హీరోయిన్ రెజీనా ఓ హీరోతో ప్రేమాయణం సాగిస్తుందని ప్రచారం జరుగుతోంది. 

గత కొద్దిరోజులుగా హీరోయిన్ రెజీనా ఓ హీరోతో ప్రేమాయణం సాగిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ. తను డేటింగ్ లో ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది.

ఆమె మాట్లాడుతూ.. ''నేను నా సహ నటుల్లో ఒకరితో డేటింగ్ లో ఉన్నానని కొన్ని రోజులుగా వార్తల్ని చూస్తున్నా.. ఎలాంటి ఆధారాలు లేకుండా రాసిన వార్తలివి. నా జీవితంలో ప్రస్తుతం ఎవరి మీదైనా ప్రేమ ఉందంటే అది నా ప్రొఫెషన్ పైనే.. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే నేనే చెబుతా'' అంటూ తనను ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పింది.

ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో సరైన అవకాశాలు లేవు. దీంతో తమిళంలో నటిస్తూ అక్కడ సత్తా  చాటుతోంది. ఇటీవల ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం 'ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా' అనే సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నా.. సరైన విజయాన్ని నమోదు చేయలేకపోయింది. 

PREV
click me!

Recommended Stories

Jr NTR: మీరు త్వరగా రావాలి, పవన్ సర్జరీపై ఎన్టీఆర్ ఫస్ట్ రియాక్షన్.. చిరు, బన్నీ, చరణ్ ఏమంటున్నారంటే
Ananya Nagalla: డబ్బులు తీసుకుని వల్గర్ గా ఫోటోలు, సమాజ సేవ కోసమే.. నేను అలా కాదు అంటున్న అనన్య