చెర్రీ ‘లూసిఫర్‌’ రీమేక్‌ రైట్స్ వెనక షాకిచ్చే నిజం!

By AN TeluguFirst Published Oct 1, 2019, 9:42 AM IST
Highlights

రీమేక్‌ సినిమాలు చిరంజీవికి మంచి హిట్స్ ను అందించాయి. ‘హిట్లర్‌’, ‘ఠాగూర్‌’, ‘శంకర్‌దాదా ఎంబిబిఎస్‌’..ఇలా వరసపెట్టి  చిరు ఖాతాలో సక్సెస్ అయిన  రీమేకులు చాలా ఉన్నాయి.

రేపు సైరా రిలీజ్ అవుతోంది. అయితే ఈ టైమ్ లో మీడియా మొత్తం మళయాళ సినిమా లూసిఫర్ గురించి మాట్లాడుతోంది. అందుకు కారణంమలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ హీరోగా నటించిన ‘లూసిఫర్‌’ రైట్స్‌ ని రామ్ చరణ్ తీసుకున్నారనే వార్తే.  ‘లూసిఫర్‌’ రైట్స్‌ చిరంజీవి కొన్నారని మళయాళ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తెలిపారు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించింది ఆయనే. కేరళలో నిర్వహించిన ‘సైరా నరసింహారెడ్డి’ ఫంక్షన్‌లో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పాల్గొన్నారు. ఆయన అత్యుత్సాహంతో లీక్ చేసిన మ్యాటర్ ఇది.

రీమేక్ రైట్స్ తీసుకోవటం పెద్ద విశేషమేమీ కాదు. రీమేక్‌ సినిమాలు చిరంజీవికి మంచి హిట్స్ ను అందించాయి. ‘హిట్లర్‌’, ‘ఠాగూర్‌’, ‘శంకర్‌దాదా ఎంబిబిఎస్‌’..ఇలా వరసపెట్టి  చిరు ఖాతాలో సక్సెస్ అయిన  రీమేకులు చాలా ఉన్నాయి.  అయితే ఆల్రెడీ తెలుగులో డబ్బింగ్ అయిన సినిమా రీమేక్ తీసుకున్నారనేది మీడియాలో చర్చనీయాంశమైంది. ఇప్పుడీ లూసిఫర్ ని రామ్ చరణ్ ఏమి చెయ్యబోతున్నారు..ఏ కారణం తో తీసుకున్నారనేది ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో డిస్కషన్ పాయింట్ గా మారింది.

అయితే అందుతున్న సమాచారం మేరకు ...ఈ సినిమా కథ, కొరటాల శివ చిరంజీవి కోసం తయారు చేసిన కథ రెండు దగ్గరగా ఉన్నాయని, రేపు లీగల్ గా ఏ సమస్యలు రాకుండా ఉండటం కోసం రైట్స్ తీసుకున్నారని చెప్తున్నారు. లూసీఫర్ ని తెలుగులో చూసిన వాళ్లు తక్కువే కాబట్టి మిగతా ఇబ్బందులు ఉండవని రామ్ చరణ్ భావిస్తున్నారట. అయితే సినిమా రిలీజ్ అయ్యాక..ఫలానా కథ కాపీ అంటూ ప్రచారం జరగకుండా ఉండటం కోసం  ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాలి.

మరో ప్రక్క ఈ సినిమా రైట్స్ ని పవన్ తో నిర్మించబోయే సినిమా కోసం రామ్ చరణ్ తీసుకున్నాడనే వాదన సైతం వినపడుతోంది. ఇక ‘సైరా’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా, త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మరో సినిమా చిరంజీవి చేయనున్నారు

click me!