ఫస్ట్ లుక్ అంటూ హాట్ పోస్టర్, బిజినెస్ కోసం ఇంత దిగజారుడా?

By Udayavani DhuliFirst Published Nov 6, 2018, 9:36 AM IST
Highlights

ఫస్ట్ లుక్, టీజర్స్, ట్రైలర్స్ తో జనాలని ఎట్రాక్ట్ చేయాలనుకోవటం తప్పులేదు. అది ఇప్పుడు ట్రెండ్ కూడా. చిన్న సినిమాలకు అదే అవసరం. అలాగని  బూతుని ఫస్ట్ లుక్ పోస్టర్స్ అంటూ వదిలే పోగ్రామ్ లు పెట్టుకోకూడదు కదా. అదే చేసింది .. ‘రాయలసీమ లవ్ స్టోరీ’చిత్రం యూనిట్. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ ని మీరు ఇక్కడ చూడండి. 

వెంకట్ , హృశాలి గోసవి జంటగా ఏ వన్ ఎంటర్ టైన్ మెంట్స్ మూవీస్ పతాకంపై నూతన దర్శలకుడు రామ్ రణధీర్రూపొందించిన చిత్రం ‘రాయలసీమ లవ్ స్టోరీ’. పంచ లింగాల బ్రదర్స్ రాయల్ చిన్నా – నాగరాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

నాగినీడు , నల్లవేణు , పృథ్వీ , జీవా , తాగుబోతు రమేష్ , అదుర్స్ రఘు , గెటప్ శ్రీను , మధుమణి ,మిర్చి మాధవి ,జబర్దస్త్ కొమరం ,రాజమౌళి , సన్నీ , భద్రం , ప్రసన్న కుమార్ తదితరులు నటించిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని , మోషన్ పోస్టర్ ని దర్శకులు జి . నాగేశ్వర్ రెడ్డి రిలీజ్ చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందజేశారు . 

దర్శకులు రామ్ రణధీర్ మాట్లాడుతూ... నాపై పూర్తి నమ్మకంతో ఈ చిత్రానికి పెట్టుబడి పెట్టారు నిర్మాతలు , వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అద్భుతమైన ఔట్ ఫుట్ వచ్చింది. నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన నిర్మాతలకు నా కృతఙ్ఞతలు.

చిత్ర నిర్మాతలు రాయల్ చిన్నా – నాగరాజు లు మాట్లాడుతూ ...రామ్ రణధీర్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా నిర్మించడానికి ముందుకు వచ్చాం . సినిమా రష్ చూసుకున్నాం చాలా బాగా వచ్చింది. నాగేశ్వర్ రెడ్డి గారి చేతుల మీదుగా మా సినిమా మోషన్ పోస్టర్ ,ఫస్ట్ లుక్ రిలీజ్ కావడం మాకు మరింత సంతోషాన్ని ఇస్తోంది . పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యాయి. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి డిసెంబర్ లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

click me!