
స్టార్ హీరోల సినిమా అంటే జంటగా హీరోయిన్ ను సెట్ చేయడం పెద్ద టాక్స్ గా మారింది దర్శకులకు. ఇప్పటి వరకూ కనిపించని రేర్ కాంబోలను సెట్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం వంశీ పైడిపల్లి కూడా అదే పనిలో ఉన్నాడు.
సిల్వర్ స్క్రీన్ పై రేర్ కాంబినేషన్ సందడి చేయబోతుంది. ఎవరూ ఇప్పటి వరకూ ఊహించిన జంట పాన్ ఇండియా సినిమాలో కలిసి కనిపించబోతున్నారు. అసలే స్టార్ హీరోలకు జంటగా హీరోయిన్లను సెట్ చేయడం డైరెక్టర్లకు చాలా పెద్ద నొప్పిగా మారింది. అదే సమస్య డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా ఫేస్ చేశారు. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో.. తమిళ స్టార్ హీరో విజయ్(Vijay) చేయబోతున్న పాన్ ఇండియా తెలుగు మూవీ కోసం హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలి అని చాలా కాలంగా తర్జనబర్జన పడుతున్నారు.
ఇక విజయ్(Vijay) జోడీగా కన్నడ సోయగం రష్మికను తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట వంశీ. విజయ్ కూడా రష్మిక ను ఒకే చేసినట్టు టాక్ వినిపిస్తుంది. ఇక తన అందం,అభినయం తో పాటు అదృష్టం కలగలిసిన హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna). తెలుగు.. కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పేస్తున్న రష్మిక,తమిళ, హిందీ భాషల్లోను కుదురుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది.
తాజాగా ఆమె విజయ్(Vijay) సినిమాలో ఛాన్స్ కొట్టేసిందనే టాక్ వినిపిస్తోంది. గతంలో కార్తి హీరోగా వచ్చిన ఓ తమిళ సినిమాలో హీరోయిన్ గా నటించింది రష్మిక(Rashmika Mandanna).. ఆతరువాత కోలీవుడ్ వైపు తిరిగి చూడలేదు స్టార్ హీరోయి. టాలీవుడ్ మీద ఫుల్ ఫోకస్ చేసిన రష్మిక(Rashmika Mandanna).. ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ రావడంతో అటు బాలీవుడ్, కోలీవుడ్ మీద కూడా ఫోకస్ చేసింది. దీంట్లో బాగంగానే విజయ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
తమిళంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న విజయ్(Vijay), ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో బీస్ట్ సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన వంశీ పైడిపల్లితో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా చివరి దశలో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక(Rashmika Mandanna) దాదాపు ఫిక్స్అయినట్టే అని తెలుస్తోంది. ఈమూవీలో మరో హీరోయిన్ కు కూడా ఛాన్స్ ఉందట. ఆ పాత్రకి పూజ హెగ్డేను తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆల్రెడీ విజయ్ తో పూజ బీస్ట్ సినిమా చేస్తోంది. అందువలన ఆమె ఈ ప్రాజెక్టులో ఉండకపోవచ్చునని సమాచారం. ఇక రెండో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారో చూడాలి.