గ్రీన్ ట్రెండ్స్ సెలూన్ ని ప్రారంభించిన యాంకర్ రష్మి!

Published : Oct 02, 2019, 03:57 PM ISTUpdated : Oct 02, 2019, 04:04 PM IST
గ్రీన్ ట్రెండ్స్ సెలూన్ ని ప్రారంభించిన యాంకర్ రష్మి!

సారాంశం

కరీంనగర్ జిల్లాలో  స్థానిక శివ థియేటర్ నందు గ్రీన్ ట్రెండ్స్ స్టైల్ సెలూన్ ని ప్రారంభించడానికి 'జబర్దస్త్' షో యాంకర్ రష్మి గౌతమ్ విచ్చేశారు.  

కరీంనగర్ లో  స్థానిక శివ థియేటర్ నందు గ్రీన్ ట్రెండ్స్ స్టైల్ సెలూన్ ని ప్రారంభించడానికి 'జబర్దస్త్' షో యాంకర్ రష్మి గౌతమ్ విచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేసిన ఆమె కాసేపు మీడియాతో ముచ్చటించింది.

కరీంనగర్ అంటే తనకు చాలా ఇష్టమని..చాలా రోజుల తరువాత మళ్లీ కరీంనగర్ లో ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ ట్రెండ్ బ్యూటీ సెలూన్ లో మహిళలను పురుషులను అందంగా తీర్చిదిద్దేలా.. కొత్త టెక్నాలజీ హంగులతో రూపొందించిన సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు.

 ఇంకా తను ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ తనకు మంచి గుర్తింపుని తెచ్చి పెట్టిన మల్లెమాల నిర్మించిన జబర్ధస్త్ షోకు ఎంతో రుణపడి ఉంటానని తెలిపారు. ప్రస్తుతం  పలు  సినిమాలలో టీవీ షోలలో నటిస్తూ బిజీ గా ఉన్నానని చెప్పుకొచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ
Tanuja Bad Luck : జాక్ పాట్ మిస్సైన తనూజ.. బిగ్ బాస్ తెలుగు 9 రన్నరప్ బ్యాడ్ లక్, విన్నర్ ను మించిన రెమ్యునరేషన్ మిస్