విడుదలకు సిద్దమైన ఇస్మార్ట్ శంకర్

Published : Jul 02, 2019, 01:25 PM ISTUpdated : Jul 02, 2019, 01:39 PM IST
విడుదలకు సిద్దమైన ఇస్మార్ట్ శంకర్

సారాంశం

యువ హీరో రామ్ - డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా కోసం ఓ వర్గం ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

యువ హీరో రామ్ - డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా కోసం ఓ వర్గం ఆడియెన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మాస్ కాంబో మొదట టైటిల్ నుంచి ఆడియెన్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తోంది. 

సాంగ్స్ అండ్ టీజర్ కూడా అంచనాలు రేపడంతో సినిమా రిలీజ్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ఇక ఫైనల్ గా సినిమా షూటింగ్ ని చిత్ర యూనిట్ ఖతమ్ చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ట్రైలర్ ను కూడా రిలీజ్ చెయ్యాలని పూరి గ్యాంగ్ ప్లాన్ వేస్తోంది. 

రామ్ సరసన నాభా నటాషా - నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అయిపోగానే జులై 18న సినిమాను రిలీజ్ చేయనున్నారు. గత కొన్నాళ్లుగా సరైన హిట్స్ లేక సతమతమవుతున్న పూరికి రామ్ కి ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. మరి వారికి ఈ సినిమా ఏ రేంజ్ లో విజయాన్ని అందిస్తుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?