''రెడ్లకి భయపడి కమ్మోళ్ళు బయటకి రావట్లేదంట''

Published : May 31, 2019, 03:38 PM IST
''రెడ్లకి భయపడి కమ్మోళ్ళు బయటకి రావట్లేదంట''

సారాంశం

వివాదాలకు కేరాఫ్ర్ అడ్రెస్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీలో వైసీపీ పార్టీ రావడంతో చాలా సంతోషంగా ఉన్నట్లు ఉన్నాడు. 

వివాదాలకు కేరాఫ్ర్ అడ్రెస్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీలో వైసీపీ పార్టీ రావడంతో చాలా సంతోషంగా ఉన్నట్లు ఉన్నాడు. తను రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను ఎట్టకేలకు ఏపీలో రిలీజ్ చేసుకున్నాడు.

ఇది ఇలా ఉండగా.. మొదటి నుండి తన వివాదాస్పద చిత్రాలు, కామెంట్స్ తో వార్తల్లో నిలిచే వర్మ త్వరలోనే కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే సినిమా తీయబోతున్నట్లు సంచలన కామెంట్స్ చేశాడు. కులాల ఆధారంగా పెట్టుకున్న టైటిల్ ని ఓపెన్ గానే చెప్పేశాడు.

దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు టైటిల్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తే మిగతా సామాజికవర్గాల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఇప్పుడు తాజాగా ట్విట్టర్ లో మరోసారి కులాలను ఉద్దేశిస్తూ మరో పోస్ట్ పెట్టారు.

'ఎండలకి భయపడి కాదు.. రెడ్లకు భయపడి కమ్మోళ్ళు బయటకి రావట్లేదంట' అని ట్వీట్ చేశాడు. చంద్రబాబు ఓటమి తరువాత ఆ సామాజిక వర్గానికి చెందినవారు అసంతృప్తికి గురయ్యారు. ఇప్పుడు వర్మ ట్వీట్ వారిని మరింత బాధిస్తోంది. 

 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?
Gurram Paapi Reddy Review: గుర్రం పాపిరెడ్డి మూవీ రివ్యూ, రేటింగ్‌.. బ్రహ్మానందం, యోగిబాబు సినిమా ఎలా ఉందంటే?