
దాదాపు 200 ఏళ్లు మన భారతీయులను ఏలిన బ్రిటీష్ వారికి.. మొట్ట మొదటి సారి ఒక ఇండియన్ అయిన రిషి సునాక్ ప్రధానిగా ఎన్నికయ్యాడు. ఈ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఇండియాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సామన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ విషయంలో స్పందిస్తున్నారు. మంగళవారం సాయంత్రం బ్రిటన్ ప్రధానిగా ప్రమాణం చేశారు రిషి సునాక్... బ్రిటన్ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచడమే ప్రస్తుతం తన ముందు ఉన్న భార్యత అన్నారు. ఇక బ్రిటన్ పౌరులకు భరోసా ఇస్తూ కీలక ప్రసంగం కూడా చేశారు.
ఈ ప్రసంగం చూసిన ప్రపంచంలోని భారతీయులు ఆయనను అభినందిస్తూ సోషల్ లో కోట్లలో పోస్టులు పెడుతున్నారు. అందు పెట్టిన పోస్ట్ లు ఒక ఎత్తు అయినే రామ్ గోపాల్ వర్మ పెట్టి పోస్ట్ ఒక ఎత్తు. చాలా మంది ఆయన ఎలా స్పందిస్తారా అని ఎదురు చూస్తున్నారు. అనుకున్నట్టుగానే రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో స్పందించారు. రిషి సునాక్ ను అభినందింస్తూ ఓ ట్వీట్ ను పోస్ట్ చేశారు ఆర్జీవి, 200 ఏళ్ల పాటు మనలను పాలించిన బ్రిటిషర్లను పాలించే అవకాశం ఎట్టకేలకు మనకు ఇప్పుడు దొరికింది అంటూ వర్మ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇలా సత్తా చాటిన రిషి సునాక్ కు అభినందనలు అంటూ వర్మ బ్రిటన్ కొత్త ప్రధానిని పొగడ్తలతో ముంచెత్తారు.
దివాళి సందర్భంగా భారతీయులకు తీపి కబురు అందింది. భారత సంతతికి చెందిన వ్యాక్తి బ్రిటన్ ప్రధాని కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నో ఏళ్ళు మన ఇండియాను పాలించిన వారికి పాలకుడిగా ఒక ఇండియన్ ఎన్నికయ్యాడని సోషల్ మీడియా పోస్ట్ లు పెడుతున్నారు. అంతే కాదు బ్రిటన్‌లో శ్వేతజాతీయేతర వ్యక్తి ప్రధానమంత్రి కావడం కూడా ఇదే తొలిసారి. ఈ విషయంలో కూడా సునాక్ రికార్డ్ సృష్టించాడు.
రిషి సునక్ బ్రిటన్ ప్రధాని కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు.. ప్రముఖులు రిషిని అభినందిస్తున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ విషయంలో స్పందిస్తున్నారు. ఈ విషయంలో ఇండియాన్ మెగాస్టార్ .. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా కాస్త భిన్నంగా రిషికి శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో రిషి సునాక్ పేరు మీద హాష్ ట్యాగ్ లు ట్రెండింగ్ లోకి వచ్చాయి.