పిల్లల సినిమా చూస్తారా..? '2.0'పై వర్మ సెటైర్లు!

By Udayavani DhuliFirst Published Nov 24, 2018, 12:47 PM IST
Highlights

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమా ప్రమోషన్స్ కోసం పక్కవారిని కూడా వాడేస్తుంటాడు. తన శిష్యుడు సిద్ధార్థని దర్శకుడిగా పరిచయం చేస్తూ 'భైరవ గీత' అనే సినిమాను నిర్మించాడు వర్మ.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమా ప్రమోషన్స్ కోసం పక్కవారిని కూడా వాడేస్తుంటాడు. తన శిష్యుడు సిద్ధార్థని దర్శకుడిగా పరిచయం చేస్తూ 'భైరవ గీత' అనే సినిమాను నిర్మించాడు వర్మ. ఈ సినిమాను రజినీకాంత్ '2.0' సినిమా రిలీజ్ తరువాతి రోజు విడుదల చేయబోతున్నారు.

దీంతో 2.0 ని తమ సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకుంటూ కొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్తున్నాడు వర్మ. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న వర్మ '2.0' సినిమాపై కామెంట్లు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

2.0 ని ఉద్దేశిస్తూ ''పెద్ద స్టార్లతో పెద్ద డైరెక్టర్ తీసిన చిన్న పిల్లల సినిమా అది, చిన్న పిల్లాడు అయి సిద్ధార్థ తీసిన అడల్ట్ సినిమా మాది.. పిల్లల సినిమా చూస్తారా..? పెద్దల సినిమా చూస్తారా..? ఏది నచ్చుతుందో తేల్చుకోండి.. నిర్ణయం మీకే వదిలేస్తున్నాం'' అంటూ తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

రాయలసీమ ఫ్యాక్షన్ నేపధ్యంలో రూపొందించిన 'భైరవ గీత' సినిమా ట్రైలర్ ఇప్పటికే యూత్ ని మెప్పించింది. కానీ '2.0' వంటి భారీ బడ్జెట్ సినిమా ముందు ఇది ఎంతవరకు నిలబడుతుందో చెప్పలేని పరిస్థితి. కానీ వర్మ మాత్రం ఈ సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నాడు!

click me!