పవన్ ఓటమిపై రామ్ చరణ్ కామెంట్స్!

Published : May 24, 2019, 05:00 PM IST
పవన్ ఓటమిపై రామ్ చరణ్ కామెంట్స్!

సారాంశం

'జనసేన' అధినేత పవన్ కళ్యాణ్ 2019 ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన పార్టీ నుండి కొందరు అభ్యర్ధులను వివిధ ప్రాంతాల నుండి పోటీకి దింపారు. 

'జనసేన' అధినేత పవన్ కళ్యాణ్ 2019 ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన పార్టీ నుండి కొందరు అభ్యర్ధులను వివిధ ప్రాంతాల నుండి పోటీకి దింపారు. పవన్ మాత్రం గాజువాక, భీమవరంల నుండి పోటీ చేశారు. 

ఆ రెండు ప్రాంతాల్లో కూడా పవన్ ఓడిపోయాడు. అంతేకాదు.. జనసేనకి ఒక్క సీటు మాత్రమే వచ్చింది. ఈ ఘోర పరాజయం జనసైనికులను నిరాశకు గురి చేసింది. ఎన్నికల ఫలితాలు తెలుసుకున్న నటుడు రామ్ చరణ్ తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

''గొప్ప నాయకులు నాయకత్వం కోసం కంటే మార్పు కోసమే పోరాడుతుంటారు. అందులో పాత్ర ఏంటనేదానికంటే లక్ష్యం చాలా ముఖ్యం. పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం సేవలు అందించిన ప్రతి ఒక్కరినీ నా ధన్యవాదాలు'' అంటూ రాసుకొచ్చారు.

ఇది చూసిన పవన్ అభిమానులు ఆయన గెలిచినా, గెలవకపోయినా మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందంటూ కామెంట్స్ పెడుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?
Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?