హీరోగా జన్మనిచ్చిన నిర్మాతకు రజినీకాంత్ గిఫ్ట్

Published : Aug 30, 2019, 02:23 PM IST
హీరోగా జన్మనిచ్చిన నిర్మాతకు రజినీకాంత్ గిఫ్ట్

సారాంశం

సినీ కెరీర్ లో సక్సెస్ సాధించిన వారు చాలా మంది సొంత టాలెంట్ తో పైకొచ్చిన వారే. అయితే ఆ టాలెంట్ ను గుర్తించే వారే లేకుంటే ఏ స్టార్ కూడా ఉండడు అనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఆ విషయాన్ని బలంగా ఒప్పుకునేవారిలో  సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు. హీరోగా తాను ఈ స్థాయికి రావడానికి సీనియర్ నిర్మాత కళైజ్ఞానం అని చెబుతూ ఉంటారు.   

అయితే రీసెంట్ గా కళైజ్ఞానంకి జరిగిన సన్మాన సభలో సూపర్ స్టార్ నిర్మాతకు ఒక వాగ్దానం ఇచ్చారు. నిర్మాతగా ఎన్నో నష్టాలను చూసిన అయన సొంత ఇల్లు కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని తెలుసుకున్న రజినీ ప్రభుత్వం సహాయం చేసేకంటే ముందే తాను తప్పకుండా ఆయనకు ఒక ఇల్లు కట్టించడానికి కృషి చేస్తానని అన్నారు. 

అదే విధంగా వీలైనంత త్వరగా ఒక పది రోజుల్లో సొంత ఇంటికి కావాల్సిన డబ్బులు కూడా ఇస్తానని రజిని చెప్పారు. అయితే ఇప్పుడు రజినీకాంత్ కలైజ్ఞానం కోసం కోటి రూపాయల విలువగల ఇంటిని చూసినట్లు తెలుస్తోంది. త్వరలోనే తన చేతుల మీదుగా ఇంటిని ఆయన పేరుమీదకు మార్చే అవకాశం ఉందని కోలీవుడ్ మీడియాలో టాక్ వస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌