ఆర్ ఆర్ ఆర్ లో రాజమౌళి అలా కనిపిస్తారట

Published : Jul 25, 2021, 03:45 PM IST
ఆర్ ఆర్ ఆర్ లో రాజమౌళి అలా కనిపిస్తారట

సారాంశం

హీరోలకు కూడా సీన్ ని నటించి మరీ చూపించే రాజమౌళి అప్పుడప్పుడు తన చిత్రాలలో జస్ట్ కనిపించి మాయమయ్యే పాత్రలు చేశారు. 


దర్శకులు తమ చిత్రాలలో తళుక్కున మెరవడం కొత్తేమి కాదు. వివి వినాయక్ తో పాటు మరికొందరు దర్శకులు తాము తెరకెక్కిస్తున్న చిత్రాలలో అలా కనిపించి కనుమరుగయ్యేవారు. గొప్ప దర్శకులుగా పేరుగాంచిన కె విశ్వనాధ్,జంధ్యాల వంటి దర్శకులు నటులుగా చేసిన విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళికి కూడా ఈ ఫ్యాషన్ ఉంది. ఆయన తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాలలో కనిపిస్తూ ఉంటారు. హీరోలకు కూడా సీన్ ని నటించి మరీ చూపించే రాజమౌళి అప్పుడప్పుడు తన చిత్రాలలో జస్ట్ కనిపించి మాయమయ్యే పాత్రలు చేశారు. 

ఆయన లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ లో కూడా రాజమౌళి తళుక్కున మెరవనున్నారని సమాచారం. ‘బాహుబలి’ తొలి భాగంలోని ప్రత్యేకగీతంలో ప్రభాస్‌, రానాతో కలిసి సందడి చేశారు. ‘మగధీర’లోనూ చివరిగా వచ్చే పాటలో ఆయన ఆడిపాడారు. అలా ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లోనూ ఆయన ఓ పాటలో మెరుస్తారని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్న ఓ పాటలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, అలియాభట్‌లతో కలిసి రాజమౌళి కాలు కదుపుతున్నారు. ప్రేమ్‌రక్షిత్‌ నృత్య దర్శకత్వం వహిస్తున్న ఆ పాట చిత్రీకరణ మరో రెండు రోజులపాటు సాగుతుంది. అనంతరం ఉక్రెయిన్‌లో ఓ పాటని తెరకెక్కించనున్నారు. దాంతో చిత్రీకరణ పూర్తవనున్నట్టు తెలుస్తోంది. 


ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో బాలీవుడ్‌ తారలు అలియాభట్‌, అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఆ పాటల్ని పూర్తి చేసి ప్రచార కార్యక్రమాలపై దృష్టి పెట్టనుంది చిత్రబృందం. దసరా సందర్భంగా అక్టోబరు 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా