వచ్చే ఏడాదే నా పెళ్లి.. హీరో రాజ్ తరుణ్ కామెంట్స్!

Published : Dec 06, 2018, 11:00 AM IST
వచ్చే ఏడాదే నా పెళ్లి.. హీరో రాజ్ తరుణ్ కామెంట్స్!

సారాంశం

'ఉయ్యాలా జంపాలా' చిత్రంతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యాడు రాజ్ తరుణ్. ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. 

'ఉయ్యాలా జంపాలా' చిత్రంతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యాడు రాజ్ తరుణ్. ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. కానీ గత రెండేళ్లుగా ఆయన నటిస్తోన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ లుగా మిగులుతున్నాయి.

దీంతో సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటివరాక్ తన తదుపరి సినిమాకి సంబంధించి ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. తాజాగా రాజ్ తరుణ్ ట్విట్టర్ వేదికగా తన అభిమానులతో ముచ్చటించారు. 

ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు తీరికగా సమాధానాలు చెప్పాడు. మహేష్ బాబుతో ఫోటో దిగి పోస్ట్ చేయొచ్చు కదా అని ఓ అభిమాని కోరగా.. 'నేను ఆయన్ని కలిశాను.. ఫోటో కూడా దిగాను.

కానీ సోషల్ మీడియాలో షేర్ చేయను. అది నేను చనిపోయేవరకు నాతోనే ఉండిపోతుంది. అది నా వ్యక్తిగత విషయమని' అన్నారు. మరో అభిమాని పెళ్లెప్పుడు అంటూ ఆడగగా.. వచ్చే ఏడాది అని బదులిచ్చాడు. అంటే ఈ కుర్ర హీరో అప్పుడే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతున్నాడన్నమాట. 
 

PREV
click me!

Recommended Stories

Chiranjeevi: బాస్ ఈజ్ బ్యాక్.. ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై మెగాస్టార్.. చిరంజీవికి కూటమి సర్కార్ బిగ్ ఆఫర్ !
Villain Ajay: తన భార్యపై నటుడు అజయ్ సంచలన వ్యాఖ్యలు..ఖుషి అప్పుడే మొదలు, విక్రమార్కుడు ఆమె వల్లే వచ్చింది